బిజినెస్

కోలుకోని స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 4: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం కూడా నష్టాల్లోనే ముగిశాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు రేకెత్తిస్తున్న ఉత్కంఠ మధ్య మదుపరులు లాభాల స్వీకరణకే ప్రాధాన్యమిచ్చారు. ఫలితంగా భారతీయ సూచీలు వరుసగా ఐదోరోజు క్షీణించగా, బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ దాదాపు నాలుగు నెలల కనిష్టాన్ని తాకుతూ 156.13 పాయింట్లు పడిపోయి 27,274.15 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 51.20 పాయింట్లు దిగజారి 8,433.75 వద్ద నిలిచింది. ఇక దీపావళితో మొదలైన కొత్త సంవత్సరం ‘సంవత్ 2073’లో తొలి వారమైన ఈ వారం మొత్తంగా సూచీలు నష్టాల్లోనే కదలాడగా, సెనె్సక్స్ 667.36 పాయింట్లు, నిఫ్టీ 204.25 పాయింట్లు పతనమయ్యాయి. విదేశీ మదుపరులతోపాటు రిటైల్ మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో సూచీలు కోలుకోవడం లేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ కంటే డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉండటంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లను భయపెడుతోంది. దుందుడుకు వైఖరి కలిగిన ట్రంప్.. అగ్రరాజ్య అధ్యక్షుడైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడుతుందన్నది మదుపరుల విశ్వాసం. దీంతో సహజంగానే భారతీయ స్టాక్ మార్కెట్లూ వారం రోజుల నుంచి నష్టపోతున్నాయి. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలుతో ఊహించిన దానికంటే ఎక్కువగా వైట్ గూడ్స్‌పై ప్రభావం ఉంటుందన్న అంచనాలూ మార్కెట్లను కోలుకోనివ్వలేదు. ఇకపోతే శుక్రవారం ట్రేడింగ్‌లో హెల్త్‌కేర్, రియల్టీ, మెటల్, టెలికామ్, క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎనర్జీ రంగాల షేర్లు నష్టాలను చవిచూశాయి. అయితే ఎఫ్‌ఎమ్‌సిజి, ఐటి రంగాల షేర్లు లాభపడ్డాయి. అయినప్పటికీ సూచీల నష్టాలు ఆగలేదు. ఇక అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో జపాన్, చైనా, హాంకాంగ్ సూచీలు నష్టపోగా, ఐరోపా మార్కెట్లలోనూ ప్రధాన సూచీలైన జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల మార్కెట్లు పడిపోయాయి.
7న బాండ్ల వేలం
విదేశీ మదుపరులకు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సోమవారం ప్రభుత్వ బాండ్ల ను వేలం వేయనుంది. 12,700 కోట్ల రూపాయలకుపైగా విలువైన ప్రభుత్వ రుణ సెక్యూరిటీలను అమ్మనుంది. సాధారణ ట్రేడింగ్ అయ్యాక మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయం త్రం 5:30 గంటల వరకు రెండు గంటలపాటు ఈ వేలం జరుగుతుంది.