బిజినెస్

వరంగల్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టు నిర్మాణానికి బిడ్లు ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 3: వరంగల్‌లో 9 వేల కోట్ల రూపాయల వ్యయంతో విద్యుత్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టు నిర్మాణానికి పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ (పిఎఫ్‌సి) బిడ్లను ఆహ్వానించింది. ఈ బిడ్లను ఈ నెల 29వ తేదీలోగా ఆసక్తి ఉన్న సంస్థలు సమర్పించాల్సి ఉంది. టారిఫ్ ఆధారిత కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా వీటికి బిడ్లను ఆహ్వానిస్తారు. కాగా, దేశంలో అతిపెద్ద ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టు వరంగల్‌లో వస్తున్నట్లు పిఎఫ్‌సి అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 5వ తేదీన ఈ బిడ్లను ఓపెన్ చేస్తారు. ఫిబ్రవరి 12వ తేదీన తక్కువ టారిఫ్‌ను కోట్ చేసిన సంస్థ పేరును ప్రకటిస్తారు. అనంతరం లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను ఎంపికైన సంస్థకు అందిస్తారు. మరోవైపు బిడ్లను దాఖలు చేయడానికి పవర్ గ్రిడ్ కార్పొరేషన్, స్టెరిలైట్ గ్రిడ్స్, ఎస్సెల్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు, అదానీ ట్రాన్స్‌మిషన్, రిలయన్స్ పవర్ ట్రాన్స్‌మిషన్ సంస్థలు పోటీ పడుతున్నాయి. వరంగల్‌లో 765/400 కెవి సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తారు. వరోరా నుంచి వరంగల్, వరంగల్ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి కర్నూలు, వరంగల్ నుంచి చిలుకలూరిపేట మధ్య విద్యుత్ పంపిణీకి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. ఇందులో 400 కెవి డబుల్ సర్క్యూట్ లైన్ల వ్యవస్థలు రెండున్నాయి. సదరన్ గ్రిడ్‌లో వరంగల్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టు కీలకం కానుంది.