బిజినెస్

అవన్నీ ఉత్తుత్తి లెక్కలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 16: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ.. భారీగా పేరుకుపోయిన మొండి బకాయిలను ఖాతా పుస్తకాల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇప్పుడు ఇది వివాదానికి కేంద్ర బిందువు అవుతోంది. ఎస్‌బిఐ రద్దు చేసిన మొండి బకాయిల జాబితాలో లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణం కూడా ఉండటమే దీనికి కారణం. 17 బ్యాంకులకు కోట్ల రూపాయల మేర రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోయిన మాల్యా సంస్థ బకాయిని ఎలా రద్దు చేస్తారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీనే వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మొండి బకాయిల రద్దుపై బుధవారం మొదలైన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన వెలిబుచ్చాయి. రాజ్యసభలో దీనిపై స్పందించిన జైట్లీ.. రిజిస్టర్‌లో రాసుకోవడానికి మాత్రమే మొండి బకాయిలను రద్దు చేసినట్లు ఎస్‌బిఐ ప్రకటించిందని, దాని అర్థం రుణ మాఫీ కాదని స్పష్టం చేశారు. తీసుకున్న అప్పుల్ని వసూలు చేయకుండా వదిలేయబోమని, ఆ చర్యలు కొనసాగుతాయన్నారు. కాగా, ఎస్‌బిఐ తమ బ్యాలెన్స్ షీట్ల సర్దుబాటులో భాగంగా 7,016 కోట్ల రూపాయలను అడ్వాన్స్ అండర్ కలెక్షన్ అకౌంట్ (ఎయుసిఎ)లోకి తీసుకెళ్లింది. ఇందులో దాదాపు 1,201 కోట్ల రూపాయల రుణం కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు చెందినదిగా నమోదైంది. అలాగే కెఎస్ ఆయిల్ (596 కోట్ల రూపాయలు), సూర్య ఫార్మాస్యూటికల్స్ (526 కోట్ల రూపాయలు), జిఇటి పవర్ (400 కోట్ల రూపాయలు), ఎస్‌ఎఐ ఇన్ఫో సిస్టమ్ (376 కోట్ల రూపాయలు) రుణాలు కూడా ఉన్నాయి. మాల్యా బకాయల వసూళ్ల కోసం తనఖా పెట్టిన ఆస్తులను పలుమార్లు వేలం వేసి బ్యాంకులు భంగపాటుకు గురైనది తెలిసిందే. కాగా, మొత్తం 63 మంది విల్‌ఫుల్ డిఫాల్టర్ల రుణాలను ఎస్‌బిఐ.. ఎయుసిఎలోకి మార్చినట్లు తెలుస్తుండగా, ఈ వివరాలను ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక తమ వెబ్‌సైట్‌లో పెట్టింది.