బిజినెస్

పర్యాటక, పారిశ్రామిక రాజధానిగా విశాఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 3: విశాఖ నగరాన్ని పర్యాటక, పారిశ్రామిక రాజధానిగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రూపొందిస్తున్నారని కేంద్ర మంత్రి సుజనాచౌదరి తెలిపారు. ఆదివారం విశాఖ ఉత్సవ్ ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని, మన చరిత్ర, సంస్కృతిని కాపాడుకునేందుకు విశాఖ ఉత్సవ్‌ను ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు. ఇక నుంచి ప్రతి వారం ఉత్తరాంధ్రలో సాంస్కృతిని కాపాడుకునేందుకు సముద్రతీరాన ఆహ్లాదకరమైన వినోదాత్మక వేదికను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని పేర్కొన్నారు. అదే విధంగా ఉత్తరాంధ్రలో ఊటిలాంటి అరకు ప్రాంతం అభివృద్ధికి, గిరిజనులను ఏ విధంగా పైకి తీసుకురావాలన్న అంశంపై ప్రణాళికలు తయారు చేస్తున్నారని చెప్పారు. సముద్ర తీరంలో రూ. 30 కోట్లతో ఓషన్ మ్యూజియం నిర్మించనున్నట్టు వెల్లడించారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ పూర్వం ఒక మత్స్యకార గ్రామంగా ఉన్న విశాఖ నగరం నేడు ఎంతగానో అభివృద్ధి చెందిందని, రానున్న కాలంలో అభివృద్ధి చెందేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. వేడుకలకు హాజరైన సినీ నటుడు బాలకృష్ణ జన సంద్రాన్ని చూసి ‘నేల ఈనిందా.. ఆకాశానికి చిల్లుపడిందా’ అన్నట్టుగా ఉందని చమత్కరించారు. ఇక్కడ జనసంద్రాన్ని చూస్తుంటే తెలుగు సంస్కృతి కన్పిస్తోందన్నారు. మంత్రి పల్లె రఘునాథ రెడ్డి మాట్లాడుతూ ఈ ఉత్సవ్‌లో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీ అవంతి శ్రీనివాస్, మంత్రులు పీతల సుజాత, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, డిఆర్‌డిఎ పిడి సత్యసాయి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ యువరాజ్‌తోపాటు పెద్ద సంఖ్యలో నగర వాసులు పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.

విశాఖ ఉత్సవ్ ముగింపు వేడుకల్లో బెలూన్లను ఎగురవేస్తున్న మంత్రులు