బిజినెస్

విదేశీ పెట్టుబడులపై ఆధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 3: విదేశీ పోర్ట్ఫోలియో మదుపరుల (ఎఫ్‌పిఐ) పెట్టుబడులు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ల కదలికలను ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం 2016-17 కోసం కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తున్న బడ్జెట్, సంస్కరణలపై అంచనాలు కూడా మదుపరుల పెట్టుబడులను నిర్దేశిస్తాయని సామ్కో సెక్యూరిటీస్ సిఇఒ జిమీత్ మోదీ అన్నారు. ఇక డిసెంబర్ నెలకుగాను ఆటోరంగ సంస్థలు వెల్లడించిన అమ్మకాల గణాంకాలు ఆయా ఆటో సంస్థల షేర్ల లావాదేవీలను శాసిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘అంతర్జాతీయ మార్కెట్ల తీరుతెన్నులు, విదేశీ మదుపరుల పెట్టుబడులు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, ముడి చమురు ధరలపై ఈ వారం మార్కెట్ ట్రేడింగ్ ఆధారపడి ఉంటుంది.’ అని క్యాపిటల్‌వయా గ్లోబల్ రిసెర్చ్ లిమిటెడ్ రిసెర్చ్ డైరెక్టర్ వివేక్ గుప్తా అన్నారు. ఇదిలావుంటే గత ఏడాది బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 1,381.88 పాయింట్లు కోల్పోయింది. సెప్టెంబర్ 8న 24,833.54 వద్దకు చేరి 2015లో అత్యంత కనిష్ట స్థాయిని తాకింది. అంతకుముందు ఏడాది 2014లో మాత్రం సెనె్సక్స్ 30 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. కానీ 2015లో 5 శాతం క్షీణతను చవిచూసింది. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం 2015-16 మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్) సంబంధించి ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థలు ప్రకటించే ఆర్థిక ఫలితాలు, వాటిపై అంచనాల ప్రభావం కూడా స్టాక్ మార్కెట్లపై ఉండొచ్చని జియోజిత్ బిఎన్‌పి పరిబాస్ ఫండమెంటల్ రిసెర్చ్ అధిపతి వినోద్ నాయర్ అన్నారు.
నేడు ప్రభుత్వ బాండ్ల వేలం
విదేశీ మదుపరులకు 7,396 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ రుణ సెక్యూరిటీలను సోమవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ వేలం వేయనుంది. మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండు గంటలపాటు ఈ వేలం జరగనుంది. ప్రభుత్వ రుణ బాండ్లలో విదేశీ పెట్టుబడుల పరిమితిని గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటిదాకా రెండుసార్లు పెంచారు. ఈ క్రమంలోనే పెరిగిన పరిమితి మేరకు వేలం జరగనుంది.