బిజినెస్

పుణ్యక్షేత్రాల పరిధిలో భూగర్భ విద్యుద్దీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 4: ఈపిడిసిఎల్ పరిధిలోని ఐదు జిల్లాల్లోని పుణ్యక్షేత్రాల్లో భూగర్భ విద్యుద్దీకరణ పనులకు 126 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రపంచబ్యాంకు నుండి ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే టెండర్లు ఖరారు చేస్తారు. విజయనగరం పట్టణంలోని పైడితల్లి అమ్మవారి దేవాలయ పరిధిలో 14.9 కిలోమీటర్ల మేర భూగర్భ విద్యుద్దీకరణ కోసం రూ. 15.87 కోట్లు, విశాఖపట్నం సింహాచలం వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి పుణ్యక్షేత్రం పరిధిలో 45.65 కిలోమీటర్ల మేర పనుల కోసం రూ. 26.20 కోట్లు అంచనా వేశారు. అదే విధంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని పుణ్యక్షేత్రాల పరిధిలో 37.1 కిలోమీటర్ల మేర భూగర్భ విద్యుద్దీకరణ వ్యవస్థను నిర్మించనున్నారు. కాకినాడలో పుణ్యక్షేత్రాలకు సంబంధించి 28 కిలోమీటర్ల మేర భూగర్భ విద్యుత్ కేబుళ్లు నిర్మించనున్నారు. విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ ప్రాంతాల్లోగల పుణ్యక్షేత్రాల పరిధిలో ఈ ప్రాజెక్టు కోసం రూ. 100.63 కోట్ల మేర ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలకు సంబంధించి రూ. 24.75 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. శ్రీకాకుళం జిల్లాలో అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి పుణ్యక్షేత్రానికి సంబంధించి రెండు కిలోమీటర్ల మేర నిర్మాణానికి రూ. 5.48 కోట్లు, శ్రీ కూర్మనాథ పుణ్యక్షేత్రం వద్ద ఒక కిలోమీటర్ మేర నిర్మాణానికి రూ. 3.07 కోట్లు, తూర్పుగోదావరి జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవాలయం వద్ద తొమ్మిది కిలోమీటర్ల నిర్మాణం కోసం రూ. 2.79 కోట్లు, ద్రాక్షారామం శ్రీ భీమేశ్వరస్వామి పుణ్యక్షేత్రం పరిధిలో దాదాపు ఏడు కిలోమీటర్ల మేర ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 5.77 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో ద్వారకా తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారి పుణ్యక్షేత్రం పరిధిలో 17 కిలోమీటర్ల మేర ప్రాజెక్టు నిర్మాణానికి మరో రూ. 7.64 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.