బిజినెస్

ఆర్థిక మంత్రి జైట్లీతో ఆర్‌బిఐ గవర్నర్ రాజన్ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 27: వచ్చే నెల 1న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఐదో ద్వైపాక్షిక ద్రవ్యసమీక్ష జరగనుంది. దీంతో శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని ఇక్కడ ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్ కలిశారు.
ఈ సందర్భంగా పలు స్థూల ఆర్థిక అంశాలపై చర్చించారు. కాగా, ఈసారి ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లు యథాతథంగానే ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ స్పందిస్తూ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ద్రవ్యసమీక్షలోనే వడ్డీరేట్లు తగ్గుతాయన్న అంచనాను వెలిబుచ్చింది. చివరిసారిగా సెప్టెంబర్‌లో జరిగిన ద్రవ్యసమీక్షలో అనూహ్యంగా ఆర్‌బిఐ.. రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లను 50 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గించినది తెలిసిందే.
మరోవైపు ఆర్‌బిఐ ప్రతిపాదిత ఐటి అనుబంధ సంస్థకు ముఖ్య కార్య నిర్వహణా అధికారి (సిఇఒ) కోసం వేట మొదలైంది. ఈ మేరకు ఆర్‌బిఐ తమ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఇదిలావుంటే పసిడి ద్రరుూకరణ పథకం (గోల్ మానిటైజేషన్ స్కీమ్)లో కొన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని రాజన్ విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. దేశవ్యాప్తంగా 52 లక్షల కోట్ల రూపాయలకుపైగా విలువైన 20,000 టన్నుల బంగారం ఉందని అంచనా. అయితే కేవలం ఈ పథకంలో 400 గ్రాముల బంగారం మాత్రమే రావడంతో మార్పులు అనివార్యమన్న అభిప్రాయాన్ని రాజన్ వ్యక్తం చేశారు.