బిజినెస్

బ్లాక్ మండే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 4: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను చవిచూశాయి. చైనా ఆర్థిక పరిస్థితులపై ఆందోళనలు, మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి మదుపరుల పెట్టుబడులను దెబ్బతీశాయి. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ మూడు నెలలకుపైగా కనిష్ట స్థాయికి దిగజారితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ నాలుగు నెలలకుపైగా కనిష్ట స్థాయికి పతనమైంది. ఉదయం ప్రారంభం నుంచే సూచీలు నష్టాల్లో మొదలయ్యాయి. సెనె్సక్స్ 190 పాయింట్లు, నిఫ్టీ 50 పాయింట్ల వరకు కోల్పోయాయి. సమయం గడుస్తున్నకొద్దీ నష్టాలు మరింత ఎక్కువైపోగా, చివరకు సెనె్సక్స్ 537.55 పాయింట్లు క్షీణించి 25,623.35 వద్ద ముగిసింది. గత ఏడాది సెప్టెంబర్ 22 తర్వాత ఈ స్థాయికి రావడం ఇదే. నిఫ్టీ సైతం 171.90 పాయింట్లు పడిపోయి 7,791.30 వద్ద స్థిరపడింది. గత ఏడాది సెప్టెంబర్ 1 తర్వాత నిఫ్టీ ఒకరోజులో ఇంతగా నష్టపోవడం ఇదే తొలిసారి. నాడు 185.45 పాయింట్లు చేజార్చుకుంది. సోమవారం ఫారెక్స్ మార్కెట్ ఇంట్రా-డే ట్రేడింగ్‌లో డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 45 పైసలు క్షీణించడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు 1.64 శాతం పెరిగి 37.89 డాలర్లను తాకడం వంటివి స్టాక్ మార్కెట్ సెంటిమెంట్‌కు విఘాతం కలిగించింది. దీంతో సూచీలు భారీ నష్టాలకు లోనవ్వాల్సి వచ్చింది. ఇకపోతే టెలికాం, బ్యాంకింగ్, ఇండస్ట్రియల్స్, ఆటో, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, హెల్త్‌కేర్, టెక్నాలజీ, చమురు, గ్యాస్, మెటల్, ఐటి, విద్యుత్ రంగాల షేర్ల విలువ 3.20 శాతం నుంచి 1.54 శాతం పతనమైంది. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో జపాన్, హాంకాంగ్, దక్షిణ కొరియా, సింగపూర్ సూచీలు 6.86 శాతం నుంచి 1.62 శాతం నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లలోనూ జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ సూచీలు ఆరంభంలో నష్టాల్లోనే కదలాడాయి. 3.61 శాతం నుంచి 2.15 శాతం కోల్పోయాయి. అమెరికా మార్కెట్లూ నష్టపోయాయ.
రూ. 100 లక్షల కోట్ల దిగువకు..
మరోవైపు బిఎస్‌ఇ సంస్థల మార్కెట్ విలువ సోమవారం 100 లక్షల కోట్ల రూపాయల దిగువకు దిగజారింది. అంతర్జాతీయ ఆందోళనల మధ్య మదుపరుల లాభాల స్వీకరణతో ఆయా సంస్థల మార్కెట్ విలువ సుమారు 1.54 లక్షల కోట్ల రూపాయలు పడిపోయింది. ఈ క్రమంలో బిఎస్‌ఇలో లిస్టయిన సంస్థల మార్కెట్ విలువ 99,39,378 లక్షల కోట్ల రూపాయలకు క్షీణించింది. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయంలో ఇది 100.93 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. కాగా, బిఎస్‌ఇ సంస్థల మార్కెట్ విలువ తొలిసారి 100 లక్షల కోట్ల రూపాయల మార్కును 2014 నవంబర్ 28న అందుకుంది. కాగా, తీవ్ర ఒడిదుడు కుల మధ్య ఆయా సంస్థల మార్కెట్ విలువలు ఇటీవలి ట్రేడింగ్‌లలో పడుతూ లేస్తూ సాగుతున్నాయ.