బిజినెస్

ఆర్థిక వ్యవస్థ ఆశాజనకంగా లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 5: దేశ ఆర్థిక వ్యవస్థ తీరు ఆశాజనకంగా లేదని, సంస్కరణల అమలు మందగించిందని పారిశ్రామిక సంఘం సిఐఐ అధ్యక్షుడు సుమిత్ మజుందార్ అన్నారు. మంగళవారం పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) తదితర సంస్కరణల అమలు ఆలస్యం కారాదని, దీని అమలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఉత్సాహాన్నిస్తుందన్నారు. సంస్కరణలు ఆగిపోలేదని, అయితే వాటి అమలు మందగించిందని పేర్కొన్నారు. జిఎస్‌టి వల్ల చేకూరే ప్రయోజనాలు అందరికీ తెలుసని, అయినప్పటికీ పార్లమెంట్‌లో అది ఆమోదం పొందలేకపోవడం విచారకరమన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాల తీరు అసంతృప్తికరంగా ఉందన్నారు.

2,800 శాఖల్లో
తక్షణ చెల్లింపు సేవలు
ప్రకటించిన ఆంధ్రా బ్యాంక్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 5: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఆంధ్రా బ్యాంక్ తమ 2,800 శాఖల్లో ఇమ్మిడియట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపిఎస్)ను ప్రారంభించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదారులు తక్షణ నగదు బదిలీ చేసుకునేందుకు వీలుగా ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు మంగళవారం స్పష్టం చేసింది. ఈ సౌకర్యం ద్వారా తక్షణమే ఫండ్ ట్రాన్స్‌ఫర్ జరుగుతుందని, వారంలో 24 గంటలు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని, గరిష్ఠంగా నగదు బదిలీ రూ. 2 లక్షల వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. అయతే ఇందుకు ప్రతి ఒక్క లావాదేవీకి 5 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుందని బ్యాంక్ స్పష్టం చేసింది.

2014-15 ఎల్‌ఐసి లాభాల్లో
ప్రభుత్వానికి రూ. 1,804 కోట్లు
ముంబయి, జనవరి 5: ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసి.. కేంద్ర ప్రభుత్వానికి 1,804.35 కోట్ల రూపాయలను చెల్లించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో అందుకున్న 36,087 కోట్ల రూపాయల లాభానికిగాను ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి ఎల్‌ఐసి అందించింది. ఎల్‌ఐసి చట్టం ప్రకారం సాధించిన లాభాల్లో 95 శాతం పాలసీదారులకు, మిగతా 5 శాతం సంస్థ యాజమాన్యమైన ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలోనే 2014-15 లాభాల్లో 5 శాతానికి సమానమైన 1,804.35 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలోనూ 1,634.89 కోట్ల రూపాయలను ఎల్‌ఐసి చెల్లించింది.