బిజినెస్

కొనసాగిన నష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 5: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా నష్టాలకే పరిమితమయ్యాయి. అయితే సోమవారంతో పోల్చితే నష్టాల తీవ్రత చాలా తక్కువగా ఉండగా, అయినప్పటికీ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ రెండు వారాలకుపైగా కనిష్ట స్థాయిని తాకింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య మదుపరులు కొనుగోళ్లకు పెద్దగా ఆసక్తి చూపలేకపోయారు. ఫలితంగానే సెనె్సక్స్ 43.01 పాయింట్లు కోల్పోయి 25,580.34 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 6.65 పాయింట్లు పడిపోయి 7,784.65 వద్ద స్థిరపడింది. ఆయా రంగాలవారీగా టెలికామ్, ఐటి, టెక్నాలజీ, బ్యాంకింగ్, ఆటో, ఫైనాన్స్, ఎఫ్‌ఎమ్‌సిజి రంగాల షేర్ల విలువ 0.55 శాతం నుంచి 0.10 శాతం పతనమైంది. అయితే మెటల్, చమురు, గ్యాస్, రియల్టీ, ఎనర్జీ రంగాల షేర్ల విలువ 2.20 శాతం నుంచి 1.07 శాతం పెరిగింది. మరోవైపు చైనా ఆర్థిక వ్యవస్థ పరిపుష్ఠిపై ఆందోళనలు గ్లోబల్ మార్కెట్లను వెంటాడగా, చైనాతోపాటు హాంకాంగ్, జపాన్, సింగపూర్, తైవాన్ సూచీలు 0.06 శాతం నుంచి 0.65 శాతం మధ్య క్షీణించాయి. దక్షిణ కొరియా సూచీ మాత్రం 0.61 శాతం పెరిగింది. ఐరోపా మార్కెట్లలోనూ ఫ్రాన్స్, జర్మనీ సూచీలు 0.19 శాతం నుంచి 0.22 శాతం దిగజారాయి. అయితే బ్రిటన్ సూచీ 016 శాతం లాభపడింది. కాగా, సోమవారం సెనె్సక్స్ 537.55 పాయింట్లు, నిఫ్టీ 171.90 పాయింట్లు క్షీణించినది తెలిసిందే.
8,200 స్థాయికి నిఫ్టీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం యుబిఎస్.. ఈ ఏడాది ఆఖరుకు నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 8,200 స్థాయిలో ఉంటుందన్న అంచనాను వ్యక్తం చేసింది. మంగళవారం ఈ మేరకు తమ రిసెర్చ్ నోట్‌లో ఈ స్విట్జర్లాండ్ సంస్థ పేర్కొంది.

రేపు భారతీయ మార్కెట్‌లోకి
మైక్రోసాఫ్ట్ ‘సర్ఫేస్’ టాబ్లెట్

న్యూఢిల్లీ, జనవరి 5: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఎట్టకేలకు దేశీయ మార్కెట్‌లో తమ సర్ఫేస్ శ్రేణి టాబ్లెట్లను ప్రవేశపెడుతోంది. ఈ నెల 7న (గురువారం) సర్ఫేస్ ప్రో 4 టాబ్లెట్‌ను భారతీయ మార్కెట్‌కు పరిచయం చేస్తోంది మైక్రోసాఫ్ట్. భారతీయ మార్కెట్‌లోకి మైక్రోసాఫ్ట్.. సర్ఫేస్ టాబ్లెట్‌ను అధికారికంగా తీసుకురావడం ఇదే తొలిసారి. గత ఏడాది నవంబర్‌లో మైక్రోసాఫ్ట్ సిఇఒ, భారత సంతతికి చెందిన సత్య నాదెళ్ల.. త్వరలోనే సర్ఫేస్ టాబ్లెట్‌ను భారత్‌కు తెస్తామని స్పష్టం చేసినది తెలిసిందే. ఈ క్రమంలో సర్ఫేస్ టాబ్లెట్ రాక ఈ వారంలోనే జరగనుంది. దీని ధర 75,000 రూపాయల పైమాటే. 12.3 అంగుళాల స్క్రీన్‌ను కలిగిన ఈ సర్ఫేస్ ప్రో 4 టాబ్లెట్.. 6 జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. విండోస్ 10 సౌకర్యమున్న ఇది టాబ్లెట్ నుంచి ల్యాప్‌టాప్‌గా కూడా మారగలదు. అన్ని డెస్క్‌టాప్ సాఫ్ట్‌వేర్లతోనూ పనిచేయనున్న దీని బరువు కేవలం 766 గ్రాములు. 9 గంటల బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఈ టాబ్లెట్ డేటా సామర్థ్యం 64 జిబి నుంచి 500 జిబి వరకు కలదు. కాగా, ప్రస్తుతం విండోస్ 10పై 200 మిలియన్ కంప్యూటర్లు పనిచేస్తున్నాయి. ఆరు నెలల క్రితం విడుదలైన ఇది మైక్రోసాఫ్ట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన ఒఎస్.