బిజినెస్

స్టాక్ మార్కెట్లకు ట్రంప్ దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారాంతపు సమీక్ష
ముంబయి, జనవరి 21: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస మూడు వారాల లాభాలకు బ్రేక్‌వేస్తూ గడచిన వారం నష్టాల్లోకి జారుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 203.56 పాయింట్లు కోల్పోగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 51 పాయింట్లు పడిపోయింది. ఫలితంగా సెనె్సక్స్ 27,034.50 వద్ద, నిఫ్టీ 8,349.35 వద్ద నిలిచాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయడం, బాధ్యతల్లోకి రావడం అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేసింది. ట్రంప్ విధానాలు అమెరికాయేతర దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసేలా ఉండటమే కారణం. ఈ కారణం చేతనే గడచిన వారం భారతీయ మార్కెట్లూ ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఇక చమురు, గ్యాస్, హెల్త్‌కేర్, ఐటి, టెక్నాలజీ, పిఎస్‌యు, మెటల్, క్యాపిటల్ గూడ్స్, బ్యాంక్స్, పవర్, ఆటో, రియల్టీ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవగా, ఎఫ్‌ఎమ్‌సిజి, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు మాత్రం మదుపరులను ఆకట్టుకుని లాభపడ్డాయి. గడిచిన వారం బిఎస్‌ఇ టర్నోవర్ 14,989.40 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ 89,837.62 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. అంతకుముందు వారం బిఎస్‌ఇ 15,416.71 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ 90,767.97 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.