బిజినెస్

5వేల టన్నుల కందిపప్పు దిగుమతికి ప్రభుత్వ సన్నాహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 5: ఉత్పత్తి తగ్గుతోందన్న ఆందోళనల మధ్య రిటైల్ మార్కెట్‌లో పప్పు్ధన్యాల ధరలు ఇప్పటికీ అధికంగానే ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 5వేల టన్నుల కందిపప్పు దిగుమతులకు ఓ టెండర్‌ను జారీ చేసింది. ప్రభుత్వరంగ సంస్థ ఎమ్‌ఎమ్‌టిసి ఈ టెండర్‌కు సంబంధించి బిడ్లను ఆయా దేశాల నుంచి ఆహ్వానించగా, బిడ్లలో నమోదయ్యే ధరల ఆధారంగా దిగుమతుల పరిమాణాన్ని పెంచుతామని ఎమ్‌ఎమ్‌టిసి తెలిపింది. మయన్మార్, మొజాంబిక్, మలావి తదితర దేశాల నుంచి బిడ్లను కోరుతోంది. కాగా, గత ఏడాది కిలో 200 రూపాయలను అధిగమించిన కందిపప్పు ధర.. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో ఉండటం కలవరపెడుతోంది. కాస్త పడిపోయినప్పటికీ ఇంకా కిలో ధర 180 రూపాయల దరిదాపుల్లో పలుకుతోంది. ఈ క్రమంలో డిమాండ్‌కు తగ్గ సరఫరా జరిగేందుకు విదేశాల నుంచి దిగుమతులు జరపాలని కేంద్ర ప్రభుత్వం.. ఎమ్‌ఎమ్‌టిసికి సూచిస్తోంది. ఇదిలావుంటే ధరల పెరుగుదల నేపథ్యంలో దేశీయంగా అక్రమంగా దాచి ఉంచిన పప్పు నిల్వలపైనా ప్రభుత్వం దాడులు చేస్తుండగా, పెద్ద ఎత్తున పట్టుబడినది తెలిసిందే. వీటిని బహిరంగ మార్కెట్‌లోకీ తరలిస్తోంది ప్రభుత్వం. 2015-16 (జూలై-జూన్) సంవత్సరంలో అంచనా కంటే తక్కువగా పప్పు్ధన్యాల ఉత్పత్తి ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఉత్పత్తి, అమ్మకాల్లో విశాఖ స్టీల్ దూకుడు

విశాఖపట్నం, జనవరి 5: ఉక్కు ఉత్పత్తి, అమ్మకాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ గత తొమ్మిది నెలల్లో గణనీయమైన ప్రగతి సాధించింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించిన ప్రగతికి సంబంధించిన వివరాలను ప్లాంట్ యాజమాన్యం మంగళవారం విడుదల చేసింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో స్టీల్ విక్రయాలు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాల్లో ఏమాత్రం వెనుకడుగు వేయలేదని ప్లాంట్ సిఎండి మధుసూదన్ తెలియచేశారు. 2014తో పోల్చితే గత ఏడాది సేలబుల్ స్టీల్ 21 శాతం వృద్ధి సాధించింది. బ్లాస్ట్ ఫర్నేస్ ఉత్పత్తి, నీటి వినియోగం, తదితర అంశాల్లో కూడా మంచి ఫలితాలు సాధించినట్టు ఆయన తెలియచేశారు. గత ఏడాది ప్రతి త్రైమాసికంలోనూ లక్ష్యాలకు మించి ఉత్పత్తి, అమ్మకాలు సాధించినట్టు చెప్పారు. గత ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ 8,636 కోట్ల రూపాయల టర్నోవర్ చేసి, ఎనిమిది శాతం వృద్ధి సాధించినట్టు వివరించారు. ఒక్క డిసెంబర్ నెలలోనే 1,617 కోట్ల రూపాయల విలువైన ఐదు లక్షల టన్నుల ఉక్కును విక్రయించామని చెప్పారు. గతంలో ఏ డిసెంబర్ నెలలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఉక్కు అమ్మకాలు జరగలేదని మధుసూదన్ వెల్లడించారు. 2013-14కుగాను విశాఖ స్టీల్ ప్లాంట్ స్టార్ పెర్ఫ్మార్డ్ అవార్డు సాధించిందని తెలిపారు. 2016లో కూడా కార్మికులు, అధికారులు సమన్వయంతో, ఆత్మస్థైర్యంతో పనిచేసి లక్ష్యాలను అధిగమించగలమన్న ఆశాభావాన్ని మధుసూదన్ వ్యక్తం చేశారు.