బిజినెస్

కొర్రలకు సాటిరాని క్వినోవా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా అండతో ప్రపంచ మార్కెట్‌లోకి క్వినోవాను తెస్తున్న బహుళజాతి సంస్థలు
కిలో ధర రూ. 1,500 ౄ సంపన్న కుటుంబాల్లో విరివిగా వాడకం
దక్షిణ భారతంలోకి పెద్ద ఎత్తున దిగుమతులు ౄ కొన్నిచోట్ల సాగు చేస్తున్న రైతులు
కిలో రూ. 50 పలికే కొర్రలతో పోల్చితే పోషకాలు అంతంతమాత్రమే
కొర్ర సాగులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి అంటున్న వ్యవసాయ శాస్తవ్రేత్తలు

నంద్యాల, జనవరి 21: దేశీయంగా పండే కొర్రలతో పోలిస్తే అగ్రరాజ్యానికి చెందిన క్వినోవాలో పోషక విలువలు తక్కువేనని వ్యవసాయ శాస్తవ్రేత్తలు ధృవీకరిస్తున్నారు. క్వినోవా బియ్యంలో పోషక విలువలు, ఇతర పదార్థాల సత్తాను పరిశీలించేందుకు కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలో శాస్తవ్రేత్తలు ఒక ప్లాట్‌లో క్వినోవా పంట సాగు చేశారు. హెక్టారుకు మూడు నుండి నాలుగు క్వింటాళ్ల దిగుబడి వచ్చే క్వినోవా పంట కంటే కొర్రసాగు వల్ల దిగుబడి పెరగడంతోపాటు ఆదాయం దక్కుతుందని వ్యవసాయ శాస్తవ్రేత్తలు గుర్తించారు. అంతేగాక ధరలో కూడా చాలా వ్యత్యాసం ఉందంటున్నారు. దక్షిణ అమెరికాలోని పెరూ దేశంలో ఆకుకూర జాతి మొక్కకు చెందినదే క్వినోవా. ఎడారి ప్రాంతంలో పండే ఈ పంటకు ఉత్తర, దక్షిణ అమెరికాల్లో పెద్ద గిరాకీ లేకపోగా అక్కడి ప్రజలు క్వినోవా బియ్యాన్ని వాడేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో అగ్రరాజ్యం కన్ను అధిక జనాభా, సంపన్నులు నివసించే మన దేశంపై పడింది. దీంతో క్వినోవా పంటను మనదేశంలో పండించి అధిక ధరకు అమ్మి సొమ్ము చేసుకొనేందుకు అక్కడి సూపర్ మార్కెట్ల ద్వారా క్వినోవా బియ్యాన్ని దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాచుర్యంలోకి తెస్తోంది అగ్రరాజ్యం అమెరికా. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని ధనికులు, సంపన్నులు నివసించే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోని సూపర్ మార్కెట్లలో క్వినోవా బియ్యం కిలో రూ. 1,500 వరకు అమ్ముతున్నారు. ఊబకాయం తగ్గాలన్నా, మధుమేహం అదుపులో ఉండాలన్నా, నాజుకుగా, ఫిట్‌గా ఉండాలన్నా క్వినోవా బియ్యంతోనే సాధ్యమని అగ్రరాజ్యానికి చెందిన వాల్‌మార్ట్ తదితర స్టోర్లు బాకా ఊదుతుండడంతో పొరిగింటి పుల్లకూర రుచి అన్న చందంగా ధనవంతులు వేలం వెర్రిగా ఎగబడిమరీ క్వినోవా కొంటున్నారు. కాగా, అగ్రరాజ్యం నుండి తెప్పించిన క్వినోవాను అనంతపురం జిల్లాలో కొంతమంది రైతులు సాగుచేస్తున్నారు. క్వినోవా నుంచి బియ్యం తియ్యాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. ప్రాసెసింగ్ యంత్రాన్ని 50 లక్షల రూపాయలు పెట్టి అమెరికా నుండి తెప్పించాల్సి ఉంటుంది. ఫలితంగా దీని ధర సైతం ఎక్కువగానే ఉంటోంది.
క్వినోవా తీరును పరిశీలిస్తే..
వర్షాభావ పరిస్థితుల్లో అతి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో పెరిగే ఎడారి మొక్క క్వినోవా. దీని పంటకాలం 110 నుండి 120 రోజులు. దిగుబడి హెక్టారుకు 3 నుండి 4 క్వింటాళ్లు.
అదే కొర్రల విషయానికి వస్తే..
దక్షిణ భారతదేశంలో అతి తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతంలో రెండు కాలాల్లో పండే పంట కొర్ర. చాలా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి రావడంతోపాటు సులభంగా ప్రాసెస్ చేసి బియ్యం తీసే వీలుంది. కొర్రల ధర కిలో 50 రూపాయలకు మించదు. కొర్రబియ్యం తినడం వల్ల ఊబకాయం తగ్గడంతోపాటు, మధుమేహం అదుపులో ఉంటుందని ఆహార నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా కొర్రబియ్యంతో చేసిన అన్నం, ఉప్మా చాలా తక్కువ మోతాదులో తిన్నా కడుపు నిండినట్లు అనిపించడం వల్ల ఎక్కువగా తినలేకపోతారు. దీంతో బరువు పెరిగే అవకాశమే ఉండదు. బెట్టను తట్టుకునే గడ్డి జాతి మొక్కకు చెందిన కొర్ర, సజ్జ, రాగుల్లో క్వినోవా కంటే ఎక్కువ పోషకాలు, ఇతర ఖనిజ లవణాలు లభిస్తుండటం విశేషం. క్వినోవా పంటను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా అగ్రరాజ్యం ఒత్తిడితో ఐక్యరాజ్య సమితి 2013వ సంవత్సరాన్ని క్వినోవా విస్తరణ సంవత్సరంగా నామకరణం చేసింది. అయతే చివరకు కొర్ర, సజ్జ, రాగుల కంటే క్వినోవాలో మేలైన, మెరుగైన పోషకాలు లేవన్న విషయాన్ని ప్రపంచ ఆహార సంస్థ కూడా ధృవీకరించిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పటికైనా పొరిగింటి పుల్లకూరపై మక్కువ తగ్గించుకుని స్థానికంగా దొరికే రాగులు, కొర్ర, సజ్జల వాడకం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. శాస్తవ్రేత్తలూ ఇదే సూచిస్తున్నారు.