బిజినెస్

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 25: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో దూసుకెళ్తున్నాయి. దీంతో పాత పెద్ద నోట్ల రద్దుకు ముందునాటి స్థాయిని అందుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ దాదాపు 3 నెలల గరిష్ఠాన్ని తాకితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 8,600 స్థాయి ఎగువకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్)గాను వివిధ సంస్థలు ప్రకటిస్తున్న ఆర్థిక ఫలితాలు మదుపరులను ఆకట్టుకుంటున్నాయి. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుతున్న సానుకూల సంకేతాలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరుస్తున్నాయి. ఈ నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టుల గడువు బుధవారంతో ముగియగా, మదుపరులు పెట్టుబడులకే ప్రాధాన్యమిచ్చారు. ఈ క్రమంలోనే సెనె్సక్స్ 332.56 పాయింట్లు ఎగిసి 27,708.14 వద్ద స్థిరపడగా, నిఫ్టీ సైతం 126.95 పాయింట్లు అందుకుని 8,602.75 వద్ద నిలిచింది. దీంతో మళ్లీ నవంబర్ 1 స్థాయికి చేరినట్లైంది. బ్యాంకింగ్ షేర్లు అత్యధికంగా 2.33 శాతం లాభాలను పొందగా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, చమురు, గ్యాస్, పిఎస్‌యు, మెటల్ షేర్లు 2.26 శాతం నుంచి 1.39 శాతం మేర లాభపడ్డాయి. బిఎస్‌ఇ మిడ్-క్యాప్ సూచీ 0.90 శాతం, స్మాల్-క్యాప్ సూచీ 0.87 శాతం పుంజుకున్నాయి. ఇక అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో ప్రధానమైన జపాన్ సూచీ గరిష్ఠంగా 1.43 శాతం పెరిగింది. చైనా, హాంకాంగ్ సూచీలు సైతం లాభాలను అందుకున్నాయి. ఐరోపా మార్కెట్లలోనూ కీలకమైన జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ సూచీలు 1.13 శాతం వరకు పుంజుకున్నాయి.
బిఎస్‌ఇ షేర్లకు అపూర్వ స్పందన
బిఎస్‌ఇ పబ్లిక్ ఇష్యూకు మదుపరుల నుంచి అపూర్వ స్పందన లభించింది. 51రెట్లు అధికంగా బిడ్లు దాఖలయ్యాయి. దీంతో 1,243 కోట్ల రూపాయల నిధుల సమీకరణే లక్ష్యంగా వచ్చిన బిఎస్‌ఇ ఐపిఒ ఘన విజయం సాధించినట్లైంది. బుధవారంతో పబ్లిక్ ఇష్యూ ముగిసింది.
ఎమ్‌ఒఐఎల్ ఆఫర్ విజయవంతం
మరోవైపు ప్రభుత్వరంగ మాంగనీస్ సంస్థ ఎమ్‌ఒఐఎల్ షేర్ల విక్రయమూ విజయవంతమైంది. ఈ ఆఫర్ కూడా బుధవారంతోనే ముగియగా, ఐదు రెట్లు అధికంగా బిడ్లు దాఖలయ్యాయి. దీంతో ప్రభుత్వానికి 480 కోట్ల రూపాయల నిధులు అందుతున్నాయి. ఈ ఆఫర్ ద్వారా సంస్థలోని వాటాలో 10 శాతాన్ని ప్రభుత్వం అమ్మింది.