బిజినెస్

మార్కెట్లకు బడ్జెట్ జోష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 1: దేశీయ స్టాక్ మార్కెట్లను బుధవారం కేంద్ర బడ్జెట్ పరుగులు పెట్టించింది. ఆదాయ పన్ను మినహాయింపులు, తగ్గింపులతో మదుపరులలో ఉత్సాహం ఉరకలెత్తింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెచ్చిన ఈ జోష్‌తో సూచీలు భారీ లాభాలను అందుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 485.68 పాయింట్లు పుంజుకుని మూడు నెలలకుపైగా గరిష్ఠ స్థాయిని తాకుతూ 28,141.64 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 155.10 పాయింట్లు ఎగిసి 8,716.40 వద్ద నిలిచింది. బడ్జెట్ కారణంగా సెనె్సక్స్, నిఫ్టీ నిరుడు అక్టోబర్ నాటి స్థాయిలను అందుకోగా, అప్పటి నుంచి కేవలం ఒక్కరోజులోనే ఈ స్థాయిలో లాభాలను సూచీలు పొందడం కూడా ఇదే తొలిసారి. ప్రభుత్వరంగ బ్యాంకులకు మూలధన సాయంగా 10,000 కోట్ల రూపాయలను కేటాయించిన జైట్లీ.. పరోక్ష బదిలీలపై విదేశీ పోర్ట్ఫోలియో మదుపరుల (ఎఫ్‌పిఐ)కు పన్ను మినహాయింపులిచ్చారు. మరోవైపు డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 40 పైసలు పెరగడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచింది. నెలన్నర గరిష్ఠాన్ని చేరుతూ 67.47 రూపాయల వద్ద స్థిరపడింది. ఇక పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో పడిపోయిన నికీ మార్కిట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పిఎమ్‌ఐ.. గత నెల జనవరిలో మళ్లీ పుంజుకోవడం కూడా మదుపరులను పెట్టుబడులవైపు నడిపించింది. నిజానికి ఉదయం ఆరంభం నుంచే లాభాల్లో కదలాడిన సూచీలు.. చివరిదాకా అదే దారిలో పయనించాయి. జైట్లీ బడ్జెట్ ప్రసంగాన్ని నిశితంగా గమనిస్తూ పెట్టుబడులపట్ల మదుపరులు నిర్ణయాలు తీసుకోగా, సమయం గడుస్తున్నకొద్దీ లాభాల స్థాయి పెరుగుతూ పోయింది. రియల్టీ, పిఎస్‌యు, చమురు, గ్యాస్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బిఎస్‌ఇ మిడ్-క్యాప్ సూచీ 1.77 శాతం పెరిగితే, స్మాల్-క్యాప్ సూచీ 1.68 శాతం లాభపడింది. ఇక అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో కీలక సూచీల్లో మిశ్రమ స్పందన కనిపించగా, ఐరోపా మార్కెట్లలో ప్రధాన సూచీలు లాభాల్లో కదలాడాయి.
కొనసాగిన ఐటి నష్టాలు
న్యూఢిల్లీ: ఐటి రంగ షేర్ల నష్టాలు వరుసగా రెండో రోజూ కొనసాగాయి. బుధవారం కూడా ఐటి షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురవగా, మంగళ, బుధవారాల్లో 44,280 కోట్ల రూపాయల మార్కెట్ విలువను కోల్పోయాయి. అమెరికా జారీచేసే హెచ్1-బి వీసాలపై కొత్త ఆందోళనలు.. భారతీయ ఐటి రంగాన్ని కుదిపేస్తున్నాయి. దేశీయ ఐటి పరిశ్రమ ఆదాయంలో అధిక భాగం విదేశాల నుంచే వస్తుండగా, అందులో అమెరికా నుంచి పొందేదే అగ్రభాగం. ఈ క్రమంలో ఆ దేశ నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ ఐటి సంస్థల ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చే హెచ్1-బి వీసాల నిబంధనలను కఠినతరం చేయడం.. భారతీయ ఐటి పరిశ్రమల ఆదాయాన్ని ప్రభావితం చేస్తోంది. దీంతో మదుపరులు ఐటి షేర్ల పెట్టుబడులకు దూరంగా ఉంటున్నారు. వీలైనంత ఎక్కువగా పెట్టుబడుల ఉపసంహరణలకు దిగుతున్నారు. కాగా, టిసిఎస్ షేర్ విలువ 2.71 శాతం, ఇన్ఫోసిస్ 1.37 శాతం, టెక్ మహీంద్ర 0.66 శాతం, విప్రో షేర్ విలువ 0.40 శాతం మేర పడిపోయింది. ఫలితంగా ఈ రెండు రోజుల్లో ఈ నాలుగు సంస్థల మార్కెట్ విలువే 44,280 కోట్ల రూపాయలు ఆవిరైపోయింది.