బిజినెస్

కొత్త ఇసుక విధానంలోనూ భారం తప్పదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 5: ప్రస్తుతం ఉన్న ఇసుక విధానానికి స్వస్తిచెప్పి మళ్లీ గనుల శాఖ ఆధ్వర్యంలో బహిరంగంగా ఇసుక రీచ్‌లకు వేలం నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో కూడా నిర్మాణ రంగంపైనా, వినియోగదారులపైనా భారం పడేలా కనిపిస్తోంది. మహిళా పొదుపు సంఘాల పర్యవేక్షణలో నడుస్తున్న ఇసుక విధానంలో వినియోగదారులపై తీవ్రస్థాయిలోనే భారం పడటంతోపాటు, సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతున్న సంగతి విదితమే.
అయతే కొత్త ఇసుక విధానంలో ఇసుక సరఫరా వేగంగా జరిగే అవకాశం ఉన్నప్పటికీ ఇసుక ధర మాత్రం వినియోగదారులకు భారమవుతుందని నిర్మాణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఇసుక విధానంలో క్యూబిక్ మీటరు ధరను రూ. 550 వరకు నిర్ణయించవచ్చని తెలుస్తోంది. అంటే రెండు యూనిట్ల ఇసుక ధర రీచ్ వద్దే రూ. 3,300 ఉండవచ్చన్నది నిర్మాణ రంగ నిపుణులు అంచనా. మహిళా పొదుపు సంఘాలకు ఇసుక బాధ్యతలను అప్పగించక ముందు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉన్న ఇసుక విధానంలో గనుల శాఖ ఇసుక వేలం నిర్వహించినపుడు రెండు యూనిట్ల ధర రీచ్ వద్ద రూ. 1,500 నుండి రూ. 1,800గా ఉంది. ఇప్పుడా ధర రూ. 3,300లకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి అదనంగా రవాణా ఖర్చులు ఉంటాయి. అంటే ఇసుక రీచ్‌లకు దగ్గరగా ఉన్న రాజమహేంద్రవరం నగరంలోని వినియోగదారుడికి ఇసుక చేరాలంటే కనీసం రూ .5 వేలుపైనే ఖర్చయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దీనికితోడు ఈసారి ఈ-వేలం విధానంలో నిర్వహించనున్న వేలంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఎక్కువ ఆదాయాన్ని ఎవరు ఇస్తారో చూసి, వారికే రీచ్ లీజును కట్టబెట్టే నిబంధనను పొందుపరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా రీచ్ వద్ద నిర్ణయించిన ఇసుక అమ్మకం ధరలో, ఎవరు ఎక్కువ ఇస్తే వారికే రీచ్ దక్కుతుందన్నమాట. ఉదాహరణకు క్యూబిక్ మీటరు ఇసుకను రూ. 550 అమ్మాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తే, ఈ మొత్తంలో ఎవరు ఎక్కువ చెల్లించేందుకు ముందుకు వస్తారో, అలాంటి దరఖాస్తుదారుల టెండర్లను వేలంలో ఖరారుచేసే అవకాశం ఉంటుందన్న మాట. ఇలాంటి నిబంధనను వేలం నిబంధనల్లో పొందుపరిచినా సరే వేలంలో రీచ్‌లను దక్కించుకునేందుకు గట్టిగానే పోటీపడాలని అప్పుడే చాలామంది కాచుకుని కూర్చున్నట్టు తెలుస్తోంది. ఇసుకను క్యూబిక్ మీటరుకు రూ. 550కి అమ్మినప్పటికీ, ఇందులో రూ. 300 చెల్లించేందుకైనా లేక చివరకు రూ. 400 చెల్లించేందుకైనా దరఖాస్తుదారులు దూకుడు ప్రదర్శించినా ఆశ్చర్యపోనవసరం లేదని తెలుస్తోంది.
రీచ్‌లో క్యూబిక్ మీటరు ఇసుక తవ్వాలంటే అన్ని ఖర్చులు కలిపి కనీసం రూ. 250 ఖర్చవుతుంది. అంటే లీజుదారుడికి మిగిలేది రూ. 250. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఎక్కువ చెల్లించేందుకైనా ఇసుక వేలంలో అనుభవం ఉన్న చాలా మంది సిద్ధమవుతున్నారంటే, కొత్త ఇసుక విధానం ఎలా ఉండబోతోందో స్పష్టమవుతోంది. రీచ్‌ను దక్కించుకుంటే చాలు తరువాత ఎలాగైనా నడిపించవచ్చన్న ధీమా అందరిలో నూ వ్యక్తమవుతోంది. ఇలాంటి ధీమాలకు కొత్త ఇసుక విధానం ఎలాంటి అడ్డుకట్ట వేస్తుందో చూడాలి మరి.