బిజినెస్

విశాఖ పోర్టును సందర్శించిన నేపాల్ బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 22: విశాఖ పోర్టును బుధవారం నేపాల్ బృందం సందర్శించింది. కేంద్ర వాణిజ్య మం త్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ దినేష్ సాగర్ భుసాల్, విదేశీ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ రామ్ ప్రసాద్ సుబేది, ఆర్థిక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ దేవి ప్రసాద్ శర్మతోపాటు పోర్టు డిప్యూటి చైర్మన్ పిఎల్ హర్‌నాథ్ నేపాల్ బృందానికి స్వాగతం పలికారు. విశాఖ పోర్టులో ఉన్న సౌకర్యా లు, వౌలిక సదుపాయాల గురించి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నేపాల్ బృందానికి వివరించారు. పోర్టు భద్రత, పారదర్శకత విషయంలో పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటి చైర్మన్ హర్‌నాథ్ చెప్పారు. అలాగే ఈ-పోర్టు విధానాన్ని అమలు చేస్తున్నా మన్నారు. భారత్‌తో నేపాల్ వాణిజ్య సంబంధాలు మెరుగుపరచుకునేందుకు విశాఖ పోర్టు అనువుగా ఉంటుందని ఆయన వివరించారు. పోర్టులో పరిస్థితులను తెలుసుకున్న నేపాల్ బృం దం.. కోల్‌కత్తా పోర్టు కన్నా, విశాఖ పోర్టు వ్యాపార లావాదేవీలకు అనుకూలంగా ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీంతో నేపాల్ సరకు రవాణా లావాదేవీలను చూసుకునేందకు అవసరమైతే విశాఖ పోర్టులోనే నేపాల్ అధికారిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని కూడా పోర్టు డిప్యూటీ చైర్మన్ హర్‌నాథ్ హామీ ఇచ్చారు.