బిజినెస్

భారీగా వాణిజ్య లోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 27: ఎగుమతి, దిగుమతుల మధ్య వ్యత్యాసమైన వాణిజ్య లోటు దేశంలో భారీగా ఉందని కృష్ణపట్నం పోర్టు డైరెక్టర్ కెప్టెన్ శ్రీరామ్ రవిచందర్ అన్నారు. శుక్రవారం విశాఖ ఎయిర్ ట్రావెర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరైన రవిచందర్ ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ మన దేశం నుంచి ఇప్పుడు జరుగుతున్న ఎగుమతులను 150 శాతం పెంచితే, దిగుమతుల స్థాయికి చేరుకోగలుగుతామన్నారు. సమీప భవిష్యత్‌లో ఎగుమతులు ఎక్కువగా పెరిగే అవకాశాలు కనిపించడం లేదని అన్నారు. ప్రపంచ మార్కెట్‌లో వృద్ధి రేటు చాలా తక్కువగా ఉందని, దీని ప్రభావం ఎగుమతి, దిగుమతులపై పడుతోందని ఆయన చెప్పారు. 7.6 శాతం వృద్ధి రేటుతో భారత దేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించిందంటే, మిగిలిన దేశాల్లో వృద్ధి రేటు ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. ఎగుమతులు పెరగాలంటే ప్రభుత్వ విధానాల్లో మార్పు రావాలని ఆయన సూచించారు. ‘మన దేశంలో లభిస్తున్న ముడిసరుకుని యథాతథంగా ఎగుమతి చేస్తున్నాం. అదే అభివృద్ధి చెందిన దేశాల్లో ముడిసరుకును ఫినిష్డ్ గూడ్స్‌గా మార్చి ఎగుమతి చేస్తున్నారు. చైనాలో ఫినిష్డ్ గూడ్స్‌ను కంటైనర్‌ల ద్వారా రవాణా చేయడం వలన షాంగై పోర్టు హ్యాండ్లింగ్స్ గణనీయంగా పెరిగాయ.’ అని రవిచందర్ తెలియచేశారు. ఇక దేశంలోని పోర్టుల విధానంలో సమూల మార్పులు తీసుకురావల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. పారదీప్ పోర్టు చిన్నదే అయినా, కార్గో హ్యాండ్లింగ్‌లో దేశంలోనే రెండో స్థానాన్ని ఆక్రమించుకుందని గుర్తుచేశారు. పారదీప్ పోర్టులో పూర్తి స్థాయి యాంత్రీకరణ ద్వారానే ఇది సాధ్యమైందని, దేశంలోని మేజర్ పోర్టులు ఏడాదికి 500 మిలియన్ టన్నుల కార్గోను, అలాగే నాన్ మేజర్ పోర్టులు 350 మిలియన్ టన్నుల కార్గోను హ్యాండిల్ చేస్తున్నాయని రవిచందర్ తెలియచేశారు. మొత్తంగా ప్రపంచ మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం సరుకు రవాణాపై పడుతోందని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా విదేశీ నౌకలు మన దేశంలో పోర్టుకు పోర్టుకు మధ్య ఉన్న పోర్టుల నుంచి సరుకు ఎగుమతి, దిగుమతి చేయకూడదన్న నిబంధన ఉండేదని, కొద్ది రోజుల కిందటే ఈ విధానాన్ని సరళతరం చేయడం వలన పోర్టుల్లో వ్యాపారం మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. కొత్తగా ఏర్పడిన కృష్ణపట్నం పోర్టుకు కర్ణాటక నుంచి కంటైనర్ కార్గో పెద్ద ఎత్తున వస్తోందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పోర్టు విస్తరణ పనులు కూడా త్వరితగతిన పూర్తి అవుతున్న నేపథ్యంలో దక్షిణ భారత దేశంలోని అత్యుత్తమ పోర్టుగా కృష్ణపట్నం పోర్టు అవతరించే అవకాశం ఉందన్నారు.

కృష్ణపట్నం పోర్టు డెరెక్టర్ శ్రీరాం రవిచందర్