బిజినెస్

బిఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బాండ్ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మార్చి 11: త్వరలో స్థానిక కేబుల్ నెట్‌వర్క్ ఆపరేటర్ల భాగస్వామ్యంతో ప్రభుత్వరంగ టెలి కామ్ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్‌ఎన్‌ఎల్) తెలంగా ణలోని తమ కస్టమర్లకు బ్రాడ్‌బాండ్ సేవలను అందించనుంది. ఇప్పటికే వరంగల్ జిల్లాలోని కొందరు కేబుల్ ఆపరేటర్లతో టైఅప్ అయ్యామని, కరీంనగర్‌లోనూ మే నెలకల్లా టైఅప్ పెట్టుకుంటామని సంస్థ తెలంగాణ విభాగం చీఫ్ జనరల్ మేనేజర్ (సిజిఎం) ఎల్ అనంతరామ్ తెలిపారు. శనివారం ఇక్కడి జిఎం కార్యాల యంలో ఏర్పాటు చేసి న విలేఖరుల సమావే శంలో మాట్లాడుతూ టైఅప్‌లో భాగంగా కేబుల్ ఆపరేటర్ల కు కేబుల్, ఇతరత్రా వౌలిక సదు పాయాలను సమకూ రుస్తామని చెప్పారు. కాగా, ప్రస్తుతం మొ బైల్, ల్యాండ్ ఫోన్ సేవల మార్కెట్‌లో తీవ్ర పోటీ ఉన్నప్పటికీ బిఎస్‌ఎన్‌ఎల్ ముందంజలో ఉంద ని, సరికొత్త ప్లాన్‌లను ప్రవేశపెట్టడంతోపాటుగా వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తున్నామన్నారు. హోలీ పండుగను పురస్కరించుకుని పలు ప్రత్యేక ఆఫర్లు ప్రవేశపెడుతున్నామని చెప్పారు. డేటా, వాయిస్ కాల్స్‌పై అదనంగా వాల్యూ సౌకర్యం కల్పిస్తున్నామని, టాప్‌అప్‌లపై కూడా 22 శాతం అదనపు విలువ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జనరల్ మేనేజర్ సుధాకర్‌రావు, డిజిఎం పిచ్చ య్య తదితరులు పాల్గొన్నారు.