బిజినెస్

నిబంధనలకు విరుద్ధం జియో కాంప్లిమెంటరీ ఆఫర్‌పై ట్రాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: ‘కాంప్లిమెంటరీ సర్వీస్ ఆఫర్’ను ఆపేయాలని రిలయన్స్ జియోకు తెలిపినట్లు టెలికామ్ రెగ్యులేటర్ ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ శుక్రవారం స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉందని జియోకు చెప్పినట్లు ఆయన ప్రకటించారు. ‘జియో కాంప్లిమెంటరీ సర్వీస్ ఆఫర్‌ను పరిశీలించాం. అది ట్రాయ్ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించాం. అందుకే దాన్ని ఆపేయాలని సంస్థకు సూచించాం.’ అని శర్మ వెల్లడించారు. నిజానికి గత నెల మార్చి 31తోనే జియో 4జి ఉచిత డేటా, కాల్స్ సేవల గడువు ముగిసినప్పటికీ, విపరీతమైన స్పందనతో సర్వర్లు డౌన్ అయ్యాయంటూ, 99 రూపాయల సభ్యత్వాన్ని చాలామంది చేసుకోలేకపోయారంటూ ఈ నెల 15 వరకు ప్రైమ్ ఆఫర్ సభ్యత్వ నమోదుకు జియో గడువును పెంచినది తెలిసిందే. 99 రూపాయల సభ్యత్వ రుసుముతోపాటు 303 రూపాయలతో రీచార్జ్ చేసుకున్నవారికి జూలై 31 వరకు ఉచితంగా డేటా, కాల్స్ సేవలు అందుతాయని ముకేశ్ అంబానీ నేతృత్వంలోని జియో అంతకుముందే ప్రకటించినదీ విదితమే. అయితే ఇది పారదర్శకంగా లేదంటూ ఈ ఆఫర్ గడువు పెంపును ఉపసంహరించుకోవాలని జియోను ట్రాయ్ గురువారం ఆదేశించింది. దీనిపై స్పందించిన జియో.. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఆఫర్ పెంపు వర్తించబోదని, అయితే అప్పటిదాకా రీచార్జ్ చేసుకున్నవారికి ఈ నాలుగు నెలలు ఉచిత సేవలు అందుతాయని స్పష్టం చేసింది.