బిజినెస్

‘స్టాండప్ ఇండియా’కు లైన్‌క్లియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 6: ఉద్యోగ సృష్టికి, వ్యాపార, పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేలా కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. కొత్త వెంచర్లకు 8,000 కోట్ల రూపాయల రుణ సదుపాయానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ముఖ్యంగా తక్కువ వడ్డీకి ఎస్‌సి, ఎస్‌టి మహిళా ఔత్సాహిక వ్యాపార, పారిశ్రామికవేత్తలకు రుణాలను అందించడానికి ‘స్టాండప్ ఇండియా’ పథకాన్ని ప్రకటించింది మోదీ సర్కారు.
3,000 కోట్ల రూపాయలను చిన్న వ్యాపారులకు సాయంగా ముద్ర క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ (సిజిఎఫ్)ను తీసుకురాగా, 50,000 రూపాయల నుంచి 10 లక్షల రూపాయల రుణాలకు ఇది పూచీకత్తుగా ఉంటుంది. ఇక 5,000 కోట్ల రూపాయలతో స్టాండప్ ఇండియా సిజిఎఫ్‌ను ఏర్పాటు చేసింది. 10 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకున్న రుణాలకు ఇది పూచీకత్తుగా ఉంటుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఇక్కడ సమావేశమైన కేంద్ర కేబినెట్ ముద్ర రుణాల కోసం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ఏర్పాటును ఆమోదించింది. అలాగే ముద్ర- ఎస్‌ఐడిబిఐ (స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ) బ్యాంక్‌లోకి ముద్ర లిమిటెడ్‌ను కలిపేందుకూ అంగీకరించింది. గత ఏడాది నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్‌బిఎఫ్‌సి)గా ముద్ర లిమిటెడ్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినది తెలిసిందే. చిన్న వ్యాపారాలకు ఆర్థిక సాయాన్ని అందించేందుకు దీన్ని తెచ్చారు. కాగా, స్టాండప్ ఇండియా పథకంలో భాగంగా దరఖాస్తుదారులకు కనీస వడ్డీరేటుకే రుణాలను బ్యాంకర్లు అందిస్తారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఈ రుణాలకు ముద్ర సిజిఎఫ్, స్టాండప్ ఇండియా సిజిఎఫ్ పూచీకత్తుగా ఉంటాయి. 2015 ఏప్రిల్‌లో ముద్ర పథకాన్ని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రారంభించినది తెలిసిందే.