బిజినెస్

- నల్లధనంపై ప్రత్యేక విండో - రూ. 2,428 కోట్ల పన్ను వసూలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 6: నల్లధనం వెలికితీతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం.. స్వచ్చంధ నల్లధన వివరాల వెల్లడి కార్యక్రమాన్ని గత ఏడాది చేపట్టినది తెలిసిందే. ఈ సందర్భంగా ప్రకటించిన ఆస్తులకు సంబంధించి మొత్తం 2,428.4 కోట్ల రూపాయల పన్నులను కేంద్ర ప్రభుత్వం వసూలు చేసింది. 2015 డిసెంబర్ 31 వరకు పన్నులు, జరిమానాల రూపంలో ఈ మొత్తాన్ని అందుకున్నట్లు ఓ ప్రకటనలో ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సిబిడిటి) తెలిపింది. ‘నల్లధన నిరోధక నూతన చట్టం ద్వారా కల్పించిన ప్రత్యేక విండోలో మొత్తం 664 డిక్లరేషన్లు వచ్చాయి. వీటిలో ఆయా సంస్థలు, వ్యక్తులు తమ నల్లధనం వివరాలను పొందుపరిచారు.’ అని సిబిడిటి వెల్లడించింది. కాగా, గత ఏడాది సెప్టెంబర్ 30న ముగిసిన ఈ విండోలో వచ్చిన 644 డిక్లరేషన్లలో వెల్లడైన అక్రమాస్తుల విలువ 4,164 కోట్ల రూపాయలు. స్వచ్చంధంగా ఇవి బహీర్గతమైన నేపథ్యంలో ఈ మొత్తం విలువలో 30 శాతం పన్ను, మరో 30 శాతం జరిమానా రూపంలో 60 శాతాన్ని చెల్లించాల్సిందిగా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలో డిసెంబర్ 31 వరకు 2,428.4 కోట్ల రూపాయలు వసూలైయ్యాయి. డిసెంబర్ తర్వాత కూడా కొన్ని చెల్లింపులు జరిగాయని సిబిడిటి తెలియజేసింది.