బిజినెస్

ఆ 386 స్టాక్స్ ట్రేడింగ్‌లో మరింత జాగ్రత్తగా ఉండండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 7: మదుపరుల ప్రయోజనాలను పరిరక్షించడం కోసం లిక్విడిటీ బాగా లేని (ఇల్‌లిక్విడ్)) 386 కంపెనీల స్టాక్స్‌లో ట్రేడింగ్ జరిపేటప్పుడు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాన స్టాక్ ఎక్స్‌చేంజిలయిన బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇలు తమ సభ్యులకు సలహా ఇచ్చాయి. పరిమిత ట్రేడింగ్ ఉన్న కారణంగా సులభంగా విక్రయించడానికి వీలు లేని స్టాక్స్‌ను ఇల్‌లిక్లిడ్ స్టాక్స్‌గా పిలుస్తారు. తరచూ ట్రేడింగ్ అయ్యే స్టాక్స్‌తో పోలిస్తే వీటిని కొనుగోలు చేసే కొనుగోలుదారులు దొరక్క పోవడం వల్ల ఇనె్వస్టర్లకు ఇవి సమస్యగా మారుతాయి. తమకోసం లేదా క్లయింట్ల కోసం ఇలాంటి స్టాక్స్‌లో ట్రేడింగ్ జరిపేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇలు సర్క్యులర్లు జారీ చేసాయి. బిఎస్‌ఇ ఇలాంటి స్టాక్స్‌ను 356, ఎన్‌ఎస్‌ఇ 29 స్టాక్స్‌ను నోటిఫై చేసాయి. ఈ రెండు ఎక్స్‌చేంజిలలోను లిస్టింగ్ అయిన ఇలాంటి స్టాక్స్‌లో గోల్డ్‌స్టోన్ టెక్నాలజీస్, ఉషా మార్టిన్ ఎడ్యుకేషన్ అండ్ సొల్యూషన్స్, ఖైతాన్ (ఇండియా), ప్రదీప్ ఓవర్సీస్, టుడేస్ రైటింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్, హోటల్ రగ్బీ, బ్లూచిప్ ఇండియా, గుజరాత్ లీజ్ ఫైనాన్సింగ్‌లాంటివి ఉన్నాయి. అంతేకాదు, జనవరి 11నుంచి ఈ386 సెక్యూరిటీలలో ఎప్పటికప్పుడు ‘కాల్ యాక్షన్’ నిర్వహించనున్నట్లు కూడా ఆ రెండు స్టాక్ ఎక్స్‌చేంజిలు తెలియజేసాయి.

రూ. 3,600 కోట్ల రుణవితరణ
లక్ష్యాన్ని అధిగమిస్తాం : ఐఆర్‌ఇడిఏ
న్యూఢిల్లీ, జనవరి 7: ఈ ఆర్థిక సంవత్సరం రూ.3,600 కోట్ల రుణ వితరణ లక్ష్యాన్ని మించగలమన్న నమ్మకాన్ని ప్రభుత్వ రంగంలోని భారతీయ సంప్రదాయేంత ఇంధన అభివృద్ధి ఏజన్సీ (ఐఆర్‌ఇడిఏ) వ్యక్తం చేసింది. మరోవైపు వెయ్యి కోట్ల రూపాయల ఆ కంపెనీ టాక్స్‌ఫ్రీ బాండ్ ఇష్యూ శనివారం ప్రారంభం కానుంది. మేము ఈ ఆర్థిక సంవత్సరానికి పెట్టుకున్న రూ 3,600 కోట్ల రుణ వితరణ లక్ష్యాన్ని మించుతాము. 2014-15 ఆర్థిక సంవత్సరం లక్ష్యమైన 2600 కోట్ల లక్ష్యంకన్నా ఇది ఎక్కువ’ అని ఐఆర్‌ఇడిఏ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కెఎస్ పొప్లి గురువారం ఇక్కడ విలేఖరులకు చెప్పారు. ఐఆర్‌ఇడిఏకు చెందిన వెయ్యి కోట్ల రూపాయల టాక్స్‌ఫ్రీ బాండ్ ఇష్యూ శనివారం మొదలై 22తో ముగుస్తుంది. రూ 1716 కోట్ల దాకా ఓవర్ సబ్‌స్క్రైబ్ కావడానికి కూడా ఈ ఇష్యూలో అవకాశముంది. ఈ ఆర్థిక సంవత్సరంలో తాము ఇప్పటివరకు బాండ్ల ద్వారా 284 కోట్లను సమీకరించామని పొప్లి చెప్పారు. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 2014-15 కన్నా ఈ ఏడాది రుణ వితరణ లక్ష్యాన్ని 40 శాతం పెంచామని కూడా ఆయన చెప్పారు. సంప్రదాయేంతర విద్యుత్ రంగంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టిపెట్టినందున 2016-17 ఆర్థిక సంవత్సరంలో కూడా ఇలాగే పెరుగుదల ఉంటుందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. వచ్చే ఏడాది అదనంగా 12 వేల మెగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యాన్ని చేర్చాలని ప్రభుత్వం అనుకొంటోందని, దీనివల్ల ఈ రంగంలో ఉన్న అందరికీ ఎంతో మేలు చేకూరుతుందని ఆయన చెప్పారు.