బిజినెస్

కొత్త జిల్లాలకు అభివృద్ధి ప్రణాళికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ౄ మేకిన్ ఇండియా తరహాలో ఉత్పాదక రంగానికి పెద్దపీట
ౄ స్టేట్ మాన్యుఫాక్చరింగ్ కాంపిటీటివ్‌నెస్ కౌన్సిల్ ఏర్పాటు
ౄ వరంగల్, మెదక్, నిజామాబాద్‌లకు విజన్ డాక్యుమెంట్
ౄ రోబోటిక్ ఆటోమేషన్ టెక్నాలజీతో డెవలెప్‌మెంట్ సెంటర్
ౄ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు మరింత ప్రోత్సాహం
ౄ పారిశ్రామికాభివృద్ధి కోసం తెలంగాణ సిఐఐ నివేదిక

హైదరాబాద్, ఏప్రిల్ 23: తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక సర్వతోముఖాభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహంపై భారతీయ పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) తెలంగాణ యూనిట్ కసరత్తు పూర్తి చేసింది. తెలంగాణ సిఐఐ యూనిట్‌కు ఇటీవలే కొత్తగా ఎన్నికైన చైర్మన్ వి రాజన్న, వైస్ చైర్మన్ సంజయ్ సింగ్‌లు ఈ మేరకు పలు కీలక అంశాలను ప్రస్తావిస్తూ సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలను కలుపుకుని ప్రతి జిల్లాకు పారిశ్రామిక విస్తరణ కోణంలో ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికను తయారు చేయాలని నివేదికలో పేర్కొన్నారు. తద్వారా దీర్ఘకాలిక పారిశ్రామిక ప్రగతికి బాటలు వేసినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా వరంగల్, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని, దీనివల్ల స్మార్ట్ సిటీల అభివృద్ధికి మార్గం సులభం అవుతుందని తెలిపారు. ఉత్పాదక రంగం అభివృద్ధి చెందితేనే ఆర్థికాభివృద్ధి, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని స్పష్టం చేసిన సిఐఐ.. రాష్ట్రంలో మాన్యుఫాక్చరింగ్ కాంపిటీటివ్‌నెస్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని తెలిపింది. మేకిన్ ఇండియా తరహాలో ఉత్పాదక రంగానికి తెలంగాణలో అధిక ప్రాధాన్యత ఇవ్వాలంది. డిఫెన్స్, ఎయిరోస్పేస్, ఫార్మా, ఎలక్ట్రానిక్ రంగాల్లో ఇప్పుడు అందిస్తున్న ప్రోత్సాహానికి తోడుగా ఉత్పాదక రంగంలో విలువ ఆధారిత ఉత్పత్తులకు మరింత చేయూతనివ్వాలని సూచించింది. హైదరాబాద్‌లో రోబోటిక్స్, ఆటోమేషన్ టెక్నాలజీ డెవలెప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసి ఈ రంగంలో కొరతగా ఉన్న నైపుణ్యాన్ని పెంచుకోవచ్చని పేర్కొంది. బిజినెస్ మానిటరింగ్ సర్వీసెస్ ద్వారా కాంపిటేటివ్ ఎక్స్‌లెన్స్‌ను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఉద్యోగులు, మానవ సంబంధాలను మెరుగుపర్చేందుకు రాష్ట్ర స్థాయి కన్సల్టేటివ్ ఫోరమ్‌ను స్టేక్ హోల్డర్స్ అందరితో కలిపి ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. నీటి నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వాటర్ పాలసీని తయారు చేయాలని పేర్కొంది. కాగా, రాష్ట్రంలోని ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే దిశగా సిఐఐ ఇండియన్ ఉమెన్ నెట్‌వర్క్ (ఐడబ్ల్యూఎన్) హైదరాబాద్ చాప్టర్, యంగ్ ఇండియన్స్ హైదరాబాద్ చాప్టర్‌తో కలిపి రెండు ప్రాజెక్టులను సిఐఐ ప్రారంభించబోతోందని సిఐఐ ప్రతినిధులు తెలిపారు. వ్యవసాయ రంగంలో ఆధునాతన టెక్నాలజీని ప్రోత్సహించేందుకుగాను ‘అగ్రిటెక్ సౌత్-2017’ను సిఐఐ నిర్వహించనుందని చెప్పారు. వ్యవసాయానికి శాస్ర్తియ విజ్ఞానాన్ని జోడించి ఉత్తమ ఫలితాలు, మెరుగైన ఉత్పాదన సాధించేందుకు అగ్రిటెక్ వంటి సమ్మిట్ దోహదపడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను ప్రోత్సహించడంతోపాటు వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలుకు సంబంధించి హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేయాలని సిఐఐ ప్రతిపాదించింది. పెట్టుబడులను మరింత ఆకర్షించేందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై దృష్టిసారించాలని తెలిపింది.