బిజినెస్

కార్పొరేట్ ఫలితాలు, ఫ్రాన్స్ ఎన్నికలు కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: ఈ వారం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రధానంగా త్రైమాసి క ఫలితాలపై ఆధారపడి నడుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికా నికి (జనవరి-మార్చి)గాను ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమి టెడ్, దేశీయ ఐటి రంగంలో మూడో అతి పెద్ద సంస్థ అయన విప్రో తమ ఆర్థిక ఫలితా లను ఈ వారమే వెల్లడిస్తున్నాయ. దీంతో వీటి ప్రకారం మదుపరులు తమ పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఫ్రాన్స్ ఎన్నికల ప్రభావం కూడా ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక ఎప్పట్లాగే డాలర్‌తో పోల్చితే రూపాయ మారకం విలువ, విదేశీ మదుపరుల పెట్టుబడులు, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల కదలికలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారతీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే అమెరికా, ఉత్తర కొరియా దేశాల మధ్య మరే ఇతర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నా దాని ప్రభావం భారత్‌సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లపై తప్పక కనిపిస్తుందని అంటున్నారు.
నేడు పసిడి బాండ్ల వేలం
ముంబయ: సావరిన్ గోల్డ్ బాండ్ల సబ్‌స్క్రిప్షన్ సోమవారం తెరుచుకోనుంది. గ్రాము ధర 2,901 రూపాయలుగా నిర్ణయంచినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలియజేసింది. ఈ పథకం 5 రోజులపాటు అందుబాటులో ఉంటుండగా, 24న మొదలై 28వ తేదీ వరకు కొనసాగుతుంది. వచ్చే నెల 12న బాండ్లను జారీ చేస్తారు.