బిజినెస్

రూ. 6 వేల కోట్లు లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24: ‘రాజకీయాల్లోకి వెళ్ళాలన్న కోరిక లేదు...హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గానే కొనసాగుతా’ అని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రహ్మణి స్పష్టం చేశారు. 2022 సంవత్సరం నాటికి హెరిటేజ్ ఫుడ్స్ ఆదాయాన్ని 6 వేల కోట్ల రూపాయలకు పెంచాలన్న లక్ష్యంతో ఉన్నట్లు ఆమె చెప్పారు. హెరిటేజ్ ఫుడ్స్ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో హెరిటేజ్ రీ-బ్రాండెడ్ లోగోను తన అత్తయ్య నారా భువనేశ్వరితో కలిసి బ్రహ్మణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విలేఖరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె చాలా చురుగ్గా సమాధానాలిచ్చారు. రజతోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామని, 15 రాష్ట్రాల్లో పెరుగు, పాలు వంటి తమ ఉత్తత్తులను విక్రయించడం గర్వంగా ఉందని, పాల సేకరణ, విక్రయంలో ముందంజలో ఉండడంపట్ల సంతో షం వెలిబుచ్చారు. రోజూ 15 లక్షల లీటర్ల పాలు సరఫరా చేస్తున్నామని, దీని ద్వారా సుమారు మూడున్నర లక్షల మంది రైతులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయన్నారు. రానున్న రోజుల్లో మరో ఐదు రాష్ట్రాలకూ తమ సేవలను విస్తరించనున్నట్లు ఆమె తెలిపారు. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌ను 1982 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ప్రారంభించినట్లు ఆమె చెప్పారు. దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పబ్లిక్ లిస్టెడ్ కంపెనీల్లో ఒకటిగా సంస్థ నిలిచిందన్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో హెరిటేజ్ ఫుడ్స్ 2,380 కోట్ల రూపాయల టర్నోవర్‌ను అధిగమించిందని వెల్లడించారు. హెరిటేజ్ ఫుడ్స్ ఇప్పుడు తాజా పాలు, పెరుగు, మజ్జిగ, లస్సీ, ఐస్ క్రీమ్, పన్నీర్, నెయ్యి, పాల పౌడర్, ఫ్లేవర్డ్ పాలు, మిల్క్ సీట్స్, యుహెచ్‌టి పాలు, డెయిరీ వైట్నర్ లాంటి పూర్తి శ్రేణి పాల ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు బ్రహ్మణి ఈ సందర్భంగా తెలిపారు. హెరిటేజ్ ఫుడ్స్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ కింద వెటర్నరీ కేర్ వ్యాపారంలో కూడా కంపెనీ కార్యకలాపాలు సాగిస్తున్నదని చెప్పారు. ప్రజల ఆరోగ్యం, న్యూట్రీషన్స్‌కు ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆమె తెలిపారు.
యూరోపియన్ డైరీ సంస్థతో జాయంట్ వెంచర్
మరోవైపు ఓ యూరోపియన్ డైరీ సంస్థతో జాయంట్ వెంచర్‌ను ప్రారంభించే పనిలో ఉన్నట్లు హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ తెలిపింది. దేశీయంగా తయారీతోపాటు యుగా ర్ట్ మార్కెటింగ్ కోసం ఈ జాయంట్ వెంచర్‌ను నెలకొల్పాలనుకుంటు న్నట్లు చెప్పింది. యూరోపియన్ సంస్థతో సంప్రదింపులు జరుపుతు న్నామని, తుది దశకు చేరుకున్నాయని తెలిపిన బ్రహ్మణి.. ఒక నెల రోజుల్లో ఓకే కావచ్చన్నారు. ఈ జాయంట్ వెంచర్‌తో హెరిటేజ్‌కు మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయన్నారు.

హెరిటేజ్ ఫుడ్స్ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నూతన లోగోను ఆవిష్కరిస్తున్న బ్రహ్మణి, చిత్రంలో నారా భువనేశ్వరి, సంస్థ ప్రతినిధులున్నారు