బిజినెస్

రిలయన్స్ దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో రికార్డు స్థాయిలో 8,046 కోట్ల రూపాయలుగా నమోదైంది. పెట్రోకెమికల్స్ వ్యాపారం నుంచి అందుకున్న భారీ ఆదాయం సంస్థ లాభాలను పెంచింది. చమురుశుద్ధి విభాగంలోనూ మిగులు ఎనిమిదేళ్ల గరిష్ఠాన్ని తాకడం కలిసొచ్చింది. మరోవైపు చివరి త్రైమాసికంలో పెరిగిన లాభంతో మొత్తం గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ లాభం మునుపెన్నడూ లేనివిధంగా 29,901 కోట్ల రూపాయలను తాకింది. ఇదిలావుంటే అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో సంస్థ లాభం 7,167 కోట్ల రూపాయలుగా ఉందని సోమవారం సంస్థ తెలియజేసింది.
రిటైల్‌కు లాభం
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రిటైల్ విభాగం రిలయన్స్ రిటైల్ ప్రీ-ట్యాక్స్ ప్రాఫిట్ గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 65.6 శాతం పెరిగి 366 కోట్ల రూపాయలుగా నమోదైంది.
అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో ఇది 221 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 10,332 కోట్ల రూపాయలుగా, పోయినసారి 5,646 కోట్ల రూపాయలుగా ఉంది.
జియోకు నష్టం
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టెలికామ్ విభాగం, సంచలన 4జి సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ నికర నష్టం ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన ఆరు నెలలకు 22.50 కోట్ల రూపాయలుగా నమోదైంది. నిరుడు సెప్టెంబర్‌లో జియో 4జి సేవలు పరిచయమైనది తెలిసిందే. అప్పటి నుంచి మార్చి 31దాకా వివిధ రకాల ఆఫర్లతో కస్టమర్లకు ఉచితంగానే ఇది 4జి సర్వీసులను అందించింది. ఈ నెల 1 నుంచే స్వల్ప చార్జీలతో ఆఫర్లను ప్రవేశపెట్టింది. దీంతో అక్టోబర్ నుంచి మార్చి వరకు సంస్థకు ఆదాయం లేకపోవడంతో నష్టాలే మిగిలాయి.