బిజినెస్

త్రైమాసిక ఆర్థిక ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్
న్యూఢిల్లీ/ముంబయ, ఏప్రిల్ 24: ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 841 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 676 కోట్ల రూపాయలుగా ఉంది. దీంతో ఈసారి 24.4 శాతం వృద్ధి నమోదైనట్లైంది. ఆదాయం ఈసారి 3,225 కోట్ల రూపాయలుగా, పోయినసారి 2,647 కోట్ల రూపాయలుగా ఉందని సోమవారం సంస్థ తెలిపింది.
అల్ట్రాటెక్ సిమెంట్
అల్ట్రాటెక్ సిమెంట్ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 11.31 శాతం క్షీణించి 725.90 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో ఇది 818.56 కోట్ల రూపాయలుగా ఉంది. అయితే ఆదాయం మాత్రం ఈసారి 4.12 శాతం పెరిగి 8,164.72 కోట్ల రూపాయలుగా నమోదైంది. పోయినసారి 7,841.05 కోట్ల రూపాయలుగా ఉంది. గతంతో పోల్చితే మొత్తం సంస్థాగత వ్యయం కూడా ఈసారి 14.33 శాతం ఎగిసింది. 6,743.85 కోట్ల రూపాయల నుంచి 7,710.32 కోట్ల రూపాయలకు చేరిందని సోమవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు తెలిపింది.
హెక్సావేర్ టెక్నాలజీస్
మధ్యశ్రేణి ఐటి సేవల సంస్థ హెక్సావేర్ టెక్నాలజీస్ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో దాదాపు 40 శాతం పెరిగి 113.9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో ఇది 83.8 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 960.5 కోట్ల రూపాయలుగా, పోయినసారి 820.2 కోట్ల రూపాయలని సోమవారం సంస్థ తెలియజేసింది.
రల్లీస్ ఇండియా
టాటా గ్రూప్‌నకు చెందిన సంస్థ రల్లీస్ ఇండియా పన్ను అనంతర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 31 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో ఇది 34 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 367 కోట్ల రూపాయలుగా, క్రిందటిసారి 371 కోట్ల రూపాయలుగా ఉందని సోమవారం సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
జెఎస్‌డబ్ల్యు హోల్డింగ్స్
జెఎస్‌డబ్ల్యు గ్రూప్‌నకు చెందిన పెట్టుబడుల సంస్థ జెఎస్‌డబ్ల్యు హోల్డింగ్స్ స్టాండలోన్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 7.16 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో ఇది 6.08 కోట్ల రూపాయలుగా ఉండగా, ఈసారి 17.7 శాతం పెరిగినట్లైంది. ఆదాయం ఈసారి 10.36 కోట్ల రూపాయలుగా, పోయినసారి 8.83 కోట్ల రూపాయలుగా ఉందని సోమవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు జెఎస్‌డబ్ల్యు హోల్డింగ్స్ వివరించింది.