బిజినెస్

మార్కెట్లకు ‘ఫ్రాన్స్’ జోష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి/న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. దాదాపు 6 వారాల్లో తొలిసారిగా భారీ లాభాలను అందుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 290.54 పాయింట్లు పుంజుకుని 29,655.84 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 98.55 పాయింట్లు ఎగబాకి 9,217.95 వద్ద స్థిరపడింది.
ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో మార్కెట్ అనుకూల ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ ముందంజలో ఉన్నట్లు వచ్చిన వార్తలు యూరోపియన్ స్టాక్ మార్కెట్లను పరుగులు పెట్టించాయి. ఈ పరిణామం భారత్‌సహా అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లకూ కలిసొచ్చింది. దీంతో అటు సెనె్సక్స్, ఇటు నిఫ్టీ రెండు వారాల గరిష్ఠ స్థాయి వద్ద ముగియగలిగాయి.
రికార్డుస్థాయికి
బిఎస్‌ఇ మార్కెట్ విలువ
మరోవైపు తాజా లాభాల నేపథ్యంలో బిఎస్‌ఇ మార్కెట్ విలువ రికార్డు స్థాయికి చేరింది. 124 లక్షల కోట్ల రూపాయలకుపైగా నమోదైంది. రియల్టీ, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్లు మదుపరులను ఆకట్టుకోవడంతో సూచీ భారీ లాభాల దిశగా పరుగులు పెట్టింది. ఫలితంగా బిఎస్‌ఇలోని సంస్థల విలువ 1,24,41,895 కోట్ల రూపాయలకు చేరింది.
మార్కెట్ లీడర్ రిలయన్స్
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్).. మార్కెట్ లీడర్‌గా మళ్లీ అవతరించింది. నాలుగేళ్లుగా ఈ హోదాను అనుభవిస్తున్న దేశీయ ఐటిరంగ దిగ్గజం టిసిఎస్‌ను రిలయన్స్ సోమవారం వెనక్కి నెట్టింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి రిలయన్స్ మార్కెట్ విలువ 4,60,518.80 కోట్ల రూపాయలుగా ఉంది. టిసిఎస్ మార్కెట్ విలువ 4,58,932.37 కోట్ల రూపాయలుగా ఉంది. రెండు సంస్థల మధ్య తేడా 1,586.43 కోట్ల రూపాయలుగా ఉంది. స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగియడం, గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో రిలయన్స్ లాభాలు ఆకర్షణీయంగా ఉండటంతో మదుపరులు పెద్ద ఎత్తున పెట్టుబడులతో ముందుకొచ్చారు.