బిజినెస్

టిటికె ప్రెస్టీజ్ మధ్యంతర డివిడెండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: ఒక్కో షేర్‌కు 15 రూపాయల మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది టిటికె ప్రెస్టీజ్. ఈ మేరకు తమ బోర్డు ఆమోదం తెలిపిందని సోమవారం స్పష్టం చేసింది. ‘సోమవారం జరిగిన సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఒక్కో షేర్‌కు 15 రూపాయల మధ్యంతర డివిడెండ్‌ను ఆమోదించారు.’ అని బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు టిటికె ప్రెస్టీజ్ తెలియజేసింది. వచ్చే నెల 3న సంస్థ రిజిస్టర్‌లో ప్రకటించే పేర్లలో ఉన్న భాగస్వాములకు అదే నెల 10న నిర్ణీత మధ్యంతర డివిడెండ్‌ను చెల్లిస్తామని వెల్లడించింది.

ఎస్‌బిఐ-క్రెడాయ్ దోస్తీ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ), నిర్మాణరంగ సంస్థల సంఘం క్రెడాయ్.. చౌక గృహ ప్రాజెక్టుల కోసం బిల్డర్లకు, కస్టమర్లకు వడ్డీ రాయితీపై రుణాలను అందించేలా ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఎమ్‌ఒయుపై ఎస్‌బిఐ, క్రెడాయ్ సంతకాలు కూడా చేశాయి. ఈ ఒప్పందం కాలపరిమితి మూడేళ్లు. ‘క్రెడాయ్‌తో ఓ ఎమ్‌ఒయును కుదుర్చుకున్నాం. దీని ప్రకారం గృహ కొనుగోలుదారులకు 10 బేసిస్ పాయింట్ల రాయితీ, క్రెడాయ్ సభ్యులకు 10-35 బేసిస్ పాయింట్ల రాయితీపై రుణాలను సమకూరుస్తాం.’ అని ఎస్‌బిఐ మేనేజింగ్ డైరెక్టర్ (నేషనల్ బ్యాంకింగ్ గ్రూప్) రజ్నీశ్ కుమార్ పిటిఐకి తెలిపారు.

‘బిజినెస్ డిగ్రీలకు
డిమాండ్ పెరుగుతోంది’

హైదరాబాద్, ఏప్రిల్ 24: దేశంలో ఎంబిఎ డిగ్రీలకు భలే గిరాకీ ఉందని ఐఎస్‌బి మాజీ డీన్ డాక్టర్ అజిత్ రంగేకర్ వ్యాఖ్యానించారు. నార్సీ మోంజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ స్టడీస్ తొలి స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 74 మందికి పిజిడిఎం, 17 మందికి పిజిడిఎం ఎంపిఇ పట్టాలను అందించారు. కార్యక్రమానికి ఛాన్సలర్ నామినీ డాక్టర్ జయంత్ గాంధీ అధ్యక్షత వహించగా, వైస్ ఛాన్సలర్ డాక్టర్ రాజన్ సక్సేనా, వైస్ ప్రోవోస్టు డాక్టర్ దేబశిష్ సన్యాల్, డిప్యుటి రిజిస్ట్రార్ వరుణ సక్సేనా, డైరెక్టర్ పృథ్వి యాదవ్‌లు పాల్గొన్నారు. డాక్టర్ రాజన్ సక్సేనా మాట్లాడుతూ దేశంలోనే ఆరు టాప్ బిజినెస్ స్కూల్స్ జాబితాలో తామున్నామన్నారు. ఎఐసిటిఇ 2016లోనే అనుమతి ఇచ్చిందని, తమ సంస్థలో చదువుకున్నవారిలో 100 శాతం మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. ప్రతి ఏటా కొత్త కొత్త సంస్థలు వచ్చి తమ విద్యార్థులను రిక్రూట్ చేస్తున్నారని తెలిపారు. తమ సంస్థలో పనిచేసినవారికి సగటున 9 లక్షల వేతనం దక్కుతోందని చెప్పారు.