బిజినెస్

తుది దశకు భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 7: విశాఖలో ఈ నెల 10వ తేదీ నుంచి మూడు రోజులపాటు సిఐఐ ఆధ్వర్యంలో జరగనున్న అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సుకు ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. ఈ సదస్సు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ యువరాజ్, నగర పోలీస్ కమిషనర్ అమిత్ గార్గ్ తదితర ఉన్నతాధికారులు గురువారం పరిశీలించారు. ఈ సదస్సుకు అతిరథ, మహారథులు హాజరవుతున్నారు. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా జరుగుతున్న భారీ సదస్సు కావటంతో ఏర్పాట్లు అత్యంత పకడ్బందీగా చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు రోజులపాటు విశాఖలోనే ఉండి, ఈ సదస్సును పర్యవేక్షించనున్నారు. అలాగే మూడు రోజుల్లో కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్, తదితరులు పాల్గొంటున్నారు. ఈ సదస్సుకు దేశ, విదేశాలకు చెందిన 800 మంది పారిశ్రామిక ప్రతినిధులు హాజరవుతున్నారు. పారిశ్రామికాభివృద్ధి, ఉత్పత్తులు, పెట్టుబడులు, తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. సుమారు 37 దేశాల నుంచి 224 మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరుకాబోతున్నారు. భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలు, మరీ ముఖ్యంగా ఆంధ్ర సాంప్రదాయాలు విదేశీ ప్రతినిధులకు తెలిసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్ర పిండి వంటలను విదేశీ ప్రతినిధులకు రుచి చూపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గోదావరి జిల్లాల నుంచి ఆత్రేయపురం పూతరేకులు, కాకినాడ కాజా వగైరాలను తెప్పిస్తున్నారు. గిరిజన, డ్వాక్రా ఉత్పత్తులు, టెక్స్‌టైల్స్‌ను ఇందులో ఉంచుతున్నారు. కలప, రాయి, లక్కతో తయారు చేసిన బొమ్మలను, బొబ్బిలి వీణలను ఈ స్టాల్స్‌లో ఏర్పాటు చేస్తున్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులకు తిరుపతి వెంకటేశ్వరస్వామి లడ్డూ, తీర్థాన్ని అందించి మన ఆధ్యాత్మికతను ప్రతినిధులకు తెలియచేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సదస్సు ప్రాంగణంలో నాలుగు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ప్రధాన ప్రాంగణాన్ని సదస్సు నిర్వహణకు వినియోగించనున్నారు. రెండోది ఏపి గ్యాలరీ, మూడోది సిఐఐ కార్యాలయం, నాలుగవది సిఎం, కేంద్ర మంత్రుల కోసం ఏర్పాటు చేశారు. ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దే బాధ్యతను వుడా చేపట్టింది. వేదిక వద్ద 40 సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు.

వీటిలో 20 కెమెరాలు ప్రధాన వేదిక వద్ద ఉంటాయి. నిర్వాహకులు జారీ చేసిన గుర్తింపు కార్డు లేకుంటే లోనికి ఎవ్వరినీ అనుమతించరు.