బిజినెస్

రూ.430 పెరిగిన బంగారం ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 7: అతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడంతో పాటుగా దేశీయ అభరణాల తయారీదారులనుంచి డిమాండ్ పెరగడంతో దేశీయ మార్కెట్లో గురువారం ఒక్క రోజే 430 రూపాయలు పెరిగి తిరిగి 26 వేల రూపాయల స్థాయికి చేరుకుంది. ఈ ఏడాది బంగారం ధర ఒక్క రోజులో ఇంతగా పెరగడం ఇదే మొదటిసారి. దీంతో పదిగ్రాముల మేలిమి బంగారం ధర ఢిల్లీ బులియన్ మార్కెట్లో రూ. 26,330 రూపాయలకు చేరుకుంది. ఆభరణాల బంగారం ధర కూడా అంతే స్థాయిలో పెరిగింది. వెండి కూడా 250 రూపాయలు పెరగడంతో తిరిగి కిలో 34,000 రూపాయల స్థాయికి చేరుకుంది. చైనా తన కరెన్సీ విలువను తగ్గించడంతో పాటు అంతర్జాతీయంగా భౌగోళికరాజకీయ ఉద్రిక్తతలు పెరగడంతో బంగారంపై పెట్టుబడి పెట్టడం సురక్షితంగా మారిందని బులియన్ వ్యాపారులు అంటున్నారు.