బిజినెస్

‘ద్వంద్వ పన్నుల నుంచి ఊరట కల్పించండి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 7: సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులపై ద్వంద్వ పన్నుల విధానంనుంచి ఊరట కల్పించాలని, అంతర్జాతీయ మార్కెట్‌లో చేపడుతున్న రక్షణాత్మక చర్యల కారణంగా తమకుకూడా రక్షణ కల్పించాలని భారతీయ ఐటి పరిశ్రమ ప్రభుత్వాన్ని కోరింది. ‘సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులపై ద్వంద్వ పన్నుల విధింపుపై మా భయాలను ప్రభుత్వానికి తెలియజేసాం. వస్తుసేవల పన్ను (జిఎస్‌టి) ఆ సమస్యను పరిష్కరించనున్నప్పటికీ అది అమలులోకి వచ్చే వరకు సమస్యను పరిష్కరించడానికి కొన్ని చర్యలు తీసుకోవాలని మేము సూచించాం’ అని గురువారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో బడ్జెట్‌కు ముందు సమావేశం తర్వాత నాస్‌కామ్ అధ్యక్షుడు రెంటాల చంద్రశేఖర్ విలేఖరులకు చెప్పారు. ఇంటర్‌నెట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే విదేశాలనుంచి పొందే సాఫ్ట్‌వేర్‌పైన ప్రభుత్వం సర్వీస్ టాక్స్ విధిస్తుండగా, దేశీయంగా కొనుగోలు చేసే సాఫ్ట్‌వేర్‌పైన వ్యాట్‌తో పాటుగా సర్వీస్ టాక్స్ కూడా విధిస్తోంది. ఈ రెండిటి మధ్య సమతౌల్యత ఉండేలా చూడాలని ఐటి రంగం ప్రభుత్వాన్ని కోరింది. ఈ సమావేశంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్), ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సిఎల్‌లాంటి ప్రముఖ ఐటి కంపెనీల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. కొన్ని భారీ మార్కెట్లు తమ దేశీయ కంపెనీలకు రక్షణ కల్పించే ఉద్దేశంతో రక్షణాత్మక చర్యలు తీసుకుంటున్న దృష్ట్యా భారతీయ ఐటి రంగం కూడా వాటితో పోటీ పడే విధంగా ఉండడమే తమ ప్రధాన సమస్య అని చంద్రశేఖర్ చెప్పారు. భారతీయ ఐటి పరిశ్రమలకు ప్రధాన వ్యాపార మార్కెట్ అయిన అమెరికా ఇటీవలే వీసా ఫీజును భారీగా పెంచిన విషయం తెలిసిందే. ఒరిజినల్ హెచ్-1బి వీసా దరఖాస్తు ఫీజు కేవలం 325 డాలర్లు ఉండగా వచ్చే ఫైలింగ్ సీజన్ అంటే ఏప్రిల్ 1నుంచి దాదాపుగా అన్ని ప్రధాన ఐటి పరిశ్రమలు కూడా ఇప్పుడు విధిస్తున్న వివిధ సుంకాల కారణంగా ఒక హెచ్-1బి వీసా కోసం 8వేలనుంచి పది వేల డాలర్ల దాకా చెల్లించాల్సి ఉంటుంది. కాగా, బోనస్ చెల్లింపుపై కార్మిక శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం 2014 ఏప్రిల్ 1నుంచి అమలులోకి వచ్చిన దృష్ట్యా దశలవారీగా చెల్లించేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా తాము ప్రభుత్వాన్ని కోరినట్లు చంద్రశేఖర్ తెలిపారు. చెన్నై వరదల తర్వాత సహాయక పునరావాస చర్యలు లాంటి ఉద్యోగులకు ఇచ్చే సదుపాయాలకు సంబంధించి ఒన్‌టైమ్ రిలీఫ్ కల్పించాలని కూడా ఐటి కంపెనీలు ఆర్థిక మంత్రిని కోరాయి.

చిత్రం... బడ్జెట్ రూపకల్పనకు ముందు ఐటి ప్రతినిధులతో భేటీ అయన జైట్లీ