బిజినెస్

త్రైమాసిక ఆర్థిక ఫలితాలు.. ఎమ్‌ఆర్‌పిఎల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎమ్‌ఆర్‌పిఎల్
న్యూఢిల్లీ, మే 19: మంగళూర్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎమ్‌ఆర్‌పిఎల్) నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 1,942 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో 1,362 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 18,100 కోట్ల రూపాయలుగా, పోయినసారి 13,477 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ చెప్పింది.
జీ ఎంటర్‌టైన్‌మెంట్
మీడియా రంగ సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ ఏకీకృ త నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 1,514 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 226.52 కోట్ల రూపాయలకే పరిమితమైంది. ఆదాయం ఈసారి 1,582.89 కోట్ల రూపాయలుగా, పోయినసారి 1,559.38 కోట్ల రూపాయలుగా ఉంది.
హిందుస్థాన్ యునిలివర్
ఎఫ్‌ఎమ్‌సిజి దిగ్గజం హిందుస్థాన్ యునిలివర్ లిమిటెడ్ స్టాండలోన్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 1,183 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో 1,114 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఆదాయం ఈసారి 8,969 కోట్ల రూపాయలుగా ఉంది. నిరుడు 8,430 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ వెల్లడించింది.
గ్రాసిమ్ ఇండస్ట్రీస్
గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 1,063.62 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 1,055.26 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 11,140.21 కోట్ల రూపాయలుగా, పోయినసారి 10,566.36 కోట్ల రూపాయలుగా ఉంది.
జెఎస్‌డబ్ల్యు స్టీల్
ఉక్కు తయారీ సంస్థ జెఎస్‌డబ్ల్యు స్టీల్ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 1,009 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో 300.6 కోట్ల రూపాయల లాభం వచ్చింది. ఆదాయం ఈసారి 17,973.06 కోట్ల రూపాయలుగా ఉంది. నిరుడు 11,815.21 కోట్ల రూపాయలుగా నమోదైందని సంస్థ వెల్లడించింది.