బిజినెస్

‘మేడ్ ఇన్ ఇండియా’ ఐఫోన్లను విక్రయిస్తున్న యాపిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 19: అమెరికా టెక్నాలజీ దిగ్గజం యాపిల్.. భారత్‌లో పలు ఎంపిక చేసిన స్టోర్లలో ‘మేడ్ ఇన్ ఇండియా’ ఐఫోన్లను ట్రయల్ రన్‌లో భాగంగా విక్రయిస్తోంది. ఐఫోన్ ఎస్‌ఇ మోడల్ ఉత్పత్తులను అమ్ముతున్నామని, ఇవి భారత్‌లోనే తయారయ్యాయని సంస్థ తెలిపింది. అయితే ఇవి పరిమిత స్థాయిలోనే ఉన్నాయని పిటిఐకి పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై యాపిల్ మాత్రం ఏవిధంగానూ స్పందించలేదు.
సంజీవ్ గుప్తాకు అత్యున్నత అవార్డు
లండన్, మే 19: బ్రిటన్‌కు చెందిన భారత సంతతి ఉక్కు వ్యాపారి, లిబర్టీ హౌస్ గ్రూప్ చైర్మన్ సంజీవ్ గుప్తాకు అత్యున్నత అంతర్జాతీయ అవార్డు లభించింది. బ్రిటన్, భారత్‌లలోనేగాక మరెన్నో ఇతర దేశాల్లో ఉక్కు పరిశ్రమకు ఆయన చేసిన సేవలు, ఈ రంగం అభివృద్ధికి అందించిన కృషికిగాను ఈ అవార్డు ఆయన్ను వరించింది. పలు దేశాల్లో ఉక్కు పరిశ్రమలను చేజిక్కించుకుని తన వ్యాపార, పారిశ్రామిక సామ్రాజ్యాన్ని గుప్తా శరవేగంగా విస్తరించుకున్నారు. కాగా, టాప్-10 ఉక్కు పరిశ్రమ దిగ్గజాలతో పోటీపడి గుప్తా ఈ అవార్డును దక్కించుకోగా, వీరిలో జెఎస్‌డబ్ల్యు స్టీల్ సిఇఒ సజ్జన్ జిందాల్, సెయిల్ సారథి ప్రకాశ్ కుమార్ సింగ్ కూడా ఉన్నారు.