బిజినెస్

- ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసు - ఈడి పిటిషన్‌పై మారన్ సోదరుల స్పందనను కోరిన హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 19: ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ ఒప్పందంతో సంబంధమున్న మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం మారన్ సోదరుల స్పందనను కోరింది ఢిల్లీ హైకోర్టు. ఇందులో భాగంగానే టెలికామ్ శాఖ మాజీ మంత్రి దయానిధి మారన్‌తోపాటు మీడియా వ్యాపారి కళానిధి మారన్, ఆయన భార్య కావేరి కళానిధి, దక్షిణాసియా ఎఫ్‌ఎమ్ లిమిటెడ్, దాని మేనేజింగ్ డైరెక్టర్ కె షణ్ముగం, సన్ డైరెక్ట్ టీవి ప్రైవేట్ లిమిటెడ్ కు జస్టిస్ ఎస్‌పి గార్గ్ నోటీసులు జారీ చేశారు. మారన్ సోదరులు, ఇతరులపై సిబిఐ, ఈడి నమోదు చేసిన కేసులను సిబిఐ ప్రత్యేక కోర్టు ఫిబ్రవరి 2న కొట్టివేసింది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టును ఈడి ఆశ్రయించింది. దీంతో దీనిపై నాలుగు వారాల్లోగా స్పందించాలంటూ నిందితులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నిజానికి సిబిఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలపై ఈడి తొలుత సుప్రీం కోర్టుకే వెళ్లగా, హైకోర్టుకెళ్లాలని సుప్రీం సూచించింది.