బిజినెస్

పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు స్వచ్ఛ ఇంధన వనరులే పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హౌరా, మే 19: దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న విద్యుత్ డిమాండ్‌ను తట్టుకోవడానికి స్వచ్ఛ, పునరుత్పాదక ఇంధన వనరులను మరింతగా ఉపయోగించుకోవలసిన అవసరం ఉందని రాష్టప్రతి అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని శిబ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉన్స్, టెక్నాలజీ (ఐఐఇఎస్‌టి)లో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన మైక్రోగ్రిడ్ విద్యుత్ ప్రాజెక్టును శుక్రవారం రాష్టప్రతి ప్రారంభించారు. విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి ఈ మైక్రో గ్రిడ్ ఫ్రాజెక్టు సౌర శక్తి, పవన శక్తి, బయోగ్యాస్‌లను ఉపయోగించుకుంటుంది. ఒక్కోటి 700 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పది భార జల విద్యుత్ రియాక్టర్లను దేశీయంగా నిర్మించడం ద్వారా స్వచ్ఛ విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి కేంద్రం ఆమోదం తెలపడం పట్ల రాష్టప్రతి సంతోషం వ్యక్తం చేశారు. అయితే దేశంలో ఇప్పటికీ 30 కోట్ల ప్రజలకు విద్యుత్ అందుబాటులో లేదని అంటూ, సామాన్యులందరికీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి విద్యుత్ సదుపాయాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా రాష్టప్రతి సెంటర్ ఫర్ వాటర్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ రిసెర్చ్‌ని కూడా ప్రారంభించారు. సాగునీటితో పాటుగా స్వచ్ఛమైన తాగునీటిని అందించడానికి మార్గాలపై ఈ కేంద్రం ప్రధానంగా దృష్టిపెట్టి పరిశోధనలు నిర్వహిస్తుంది. ఇస్రో మాజీ చైర్మన్, ఐఐఇఎస్‌టి బోర్డు ఆఫ్ గవర్నర్స్ చైర్‌పర్సన్ కె రాధాకృష్ణన్, సంస్థ డైరెక్టర్ అజయ్ కుమార్ రే, రిజిస్ట్రార్ బిమన్ బందోపాధ్యాయ, పశ్చిమ బెంగాల్ విద్యుత్ మంత్రి సోవన్‌దేబ్ చటోపాధ్యాయ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంస్థలో ఏర్పాటు చేసిన స్మార్ట్ మైక్రోగ్రిడ్ సెంటర్ క్యాంపస్ అంతటినుంచి సేకరించే సుమారు 600-1000 కిలోల కిచెన్, ఫుడ్ వేస్ట్‌ను ఉపయోగించుకుని బయోగ్యాస్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. పశ్చిమబెంగాల్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్‌మెం ట్ ఏజన్సీ ఈ స్మార్ట్ గ్రిడ్ ప్రాజెక్టును రూపొందించింది.