బిజినెస్

జోరుగా లాభాలు .... పరుగులు తీస్తున్న స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 25: మాంచెస్టర్ ఉగ్రదాడి, సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా గత రెండు రోజులుగా నష్టాల్లో సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం అంతర్జాతీయంగా సానుకూల సంకేతాల నేపథ్యంలో లాభాల్లో దూసుకెళ్లాయి. బిఎస్‌ఇ సెనె్సక్స్ ఏకంగా 448 పాయింట్లు లాభపడి గత రికార్డులన్నిటినీ చెరిపేసి 30,750 పాయింట్ల సరికొత్త రికార్డుకు చేరుకోగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ మళ్లీ 9,500 పాయింట్ల ఎగువన ముగిసింది. వడ్డీ రేట్ల పెంపుకోసం మరింత సానుకూల డేటా కోసం ఎదురు చూస్తామని అమెరికా ఫెడరల్ రిజర్వ్‌నుంచి సంకేతాలు అందడమే దేశీయ స్టాక్ మార్కెట్ల పరుగులకు ప్రధాన కారణం. మార్కెట్లలో ఒక్కసారిగా ఉత్సాహం రావడానికి ఈ నెల 2-3 తేదీల్లో జరిగిన అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం నిర్ణయాలే ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. మే నెల ఫ్యూచర్స్, ఆప్షన్ల కాంట్రాక్ట్‌లకు గురువారం చివరి రోజు కావడంతో ఇనె్వస్టర్లు మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్లకు భారీగా మొగ్గు చూపారు. ఫలితంగా సెనె్సక్స్ ప్రారంభంనుంచి కూడా లాభాల్లో పరుగులు తీసి ఒక దశలో 30,793.43 పాయింట్ల గరిష్ఠ స్థాయిని చేరినప్పటికీ చివరికి 448.39 పాయింట్ల లాభంతో 30,750.03 పాయింట్ల వద్ద ముగిసింది. గత మార్చి 14 తర్వాత సెనె్సక్స్ ఒకే రోజు ఇంత భారీగా పెరగడం ఇదే తొలిసారి. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 149.20 పాయింట్లు పెరిగి మరోసారి 9500 పాయింట్ల ఎగువన ముగిసింది. మరోవైపు డాలరుతో రూపాయి సైతం వరసగా రెండో రోజు బలపడింది. బుధవారం వాల్‌స్ట్రీట్ మార్కెట్ లాభాల్లో ముగియడంతో ఆసియా మార్కెట్లు సైతం మంచి లాభాలే ఆర్జించాయి. ఎల్‌అండ్‌టి ఏకంగా దాదాపు 5 శాతం పెరిగి లాభాల్లో అగ్రస్థానంలో నిలవగా ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, ఇన్ఫోసిస్‌లు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అద్భుతమైన త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో వోల్టాస్ షేరు మరో 6.25 శాతం పెరిగింది. కాగా, ఔషధ తయారీ దిగ్గజం లుపిన్ షేరు 7.31 శాతం పడిపోయింది. ఐరోపా మార్కెట్లు సైతం ప్రారంభంనుంచే లాభాల్లో సాగాయి.
29నుంచి 61 కంపెనీ డీలిస్ట్
ఇదిలా ఉండగా దాదాపు 13 ఏళ్లుగా సస్పెన్షన్లలో కొనసాగిన నేపథ్యంలో బిఎస్‌ఇ ఈ నెల 29నుంచి 61 సంస్థలను తన ప్లాట్‌ఫామ్‌నుంచి డీలిస్ట్ చేయనుంది. ఇలా డీలిస్ట్ అవుతున్న సంస్థల్లో బినాకా సింథటిక్ రెసిన్స్, కానే్వ కెమికల్స్, చేతక్ స్పింటెక్స్, గ్లోబల్ ఇండస్ట్రీస్, కరణ్ ఫైనాన్స్, మహేంద్ర ఫైనాన్స్, మానవ్ ఫార్మా, మారుతి ఆర్గానిక్స్, రామ్స్ ట్రాన్స్‌ఫార్మర్స్, రెజెంట్ కెమికల్స్, రోహిణి స్ట్రిప్స్, సరళా క్రెడిట్స్ అండ్ సెక్యూరిటీస్, సన్‌రైజ్ జింక్, థాపర్ ఎక్స్‌పోర్ట్స్, విశాల్ చైర్స్‌లాంటివి ఉన్నాయి. 61 కంపెనీలు 13 ఏళ్లకు పైగా సస్పెన్షన్‌లో కొనసాగుతున్నందున వాటిని ఈ నెల 29నుంచి తమ ప్లాట్‌ఫామ్‌నుంచి డీలిస్ట్ చేయడం జరుగుతుందని ఎక్స్‌చ్రేంజిలో ట్రేడింగ్ జరిపే సభ్యులకు తెలియజేయడం జరిగిందని బిఎస్‌ఇ ఒక గురువారం ప్రకటనలో తెలిపింది.