బిజినెస్

భారత మార్కెట్లోకి ‘సర్ఫేస్’ ట్యాబ్లెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 7: అంతర్జాతీయ ఐటి దిగ్గజ సంస్థల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ ఎట్టకేలకు తన ‘సర్ఫేస్’ శ్రేణి ట్యాబ్లెట్లను భారత మార్కెట్‌కు తీసుకొచ్చింది. వీటిలో అత్యాధునిక వెర్షన్ అయిన ‘సర్ఫేస్ ప్రో-4’ ట్యాబ్లెట్ ధర రూ.89,990 నుంచి ప్రారంభమవుతుంది. పూర్తిస్థాయి మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌తో పనిచేసే విధంగా రూపొందించిన ఈ ట్యాబ్లెట్ ‘సర్ఫేస్ పెన్’తో పాటు ‘విండోస్ హలో’, ‘మైక్రోసాఫ్ట్ ఎడ్జ్’, ‘కోర్టానా’ తదితర ఫీచర్లను కలిగి ఉంటుంది. ‘సర్ఫేస్’ ట్యాబ్లెట్లను త్వరలో భారత్‌కు తీసుకొస్తామని మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల గత ఏడాది నవంబర్‌లో ప్రకటించిన విషయం విదితమే. ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న ‘సర్ఫేస్ ప్రో-4’ ట్యాబ్లెట్ ఇప్పుడు భారత్‌లోని వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిందని, మెరుగైన పనితీరుతో ప్రీమియం పోర్టబిలిటీని కోరుకునే గాడ్జెట్ ప్రేమికులకు ఇది ఎంతో ఉత్తమ ఎంపిక అవుతుందని ‘మైక్రోసాఫ్ట్ ఇండియా’ చైర్మన్ భాస్కర్ ప్రామాణిక్ గురువారం న్యూఢిల్లీలో విలేఖర్లతో అన్నారు. 12.3 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండి, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్)తో పనిచేసే ‘సర్ఫేస్ ప్రో-4’ ట్యాబ్లెట్ మూడు రకాల ఇంటెల్ ప్రాసెసర్లతో (ఐ3, ఐ5, ఐ7) లభ్యమవుతుంది. 4జిబి, 8జిబి ర్యామ్‌లతో 128జిబి, 256జిబి అంతర్గత స్టోరేజీ సామర్ధ్యాలను కలిగి ఉండే ఈ ట్యాబ్లెట్లలో వినియోగదారులు తమకు అనువైన దానిని ఎంచుకోవచ్చు. అత్యాధునికమైన 3.0 యుఎస్‌బి పోర్టు, కార్డు రీడర్‌లతో పాటు ముందు 5 మెగాపిక్సెల్, వెనుక 8 మెగాపిక్సెల్ కెమెరాలను కలిగి ఉండే సర్ఫేస్ ప్రో-4 ‘డాల్బీ ఆడియో’ సౌండ్ ఎన్‌హాన్స్‌మెంట్‌తో లభ్యమవుతుంది. అలాగే దీనికి ముందు వెర్షన్ అయిన ‘సర్ఫేస్ ప్రో-3’ ట్యాబ్లెట్ ధర రూ.73,990 ధర నుంచి ప్రారంభమవుతుంది. ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ‘అమెజాన్.ఇన్’ ద్వారా వినియోగదారులు గురువారం నుంచి ఈ ట్యాబ్లెట్‌ను బుక్ చేసుకోవచ్చని, ఈ నెల 14వ తేదీ నుంచి వీటి డెలివరీ ప్రారంభమవుతుందని ‘మైక్రోసాఫ్ట్ ఇండియా’ స్పష్టం చేసింది. కేవలం 6 నెలల క్రితమే ఆవిష్కరించిన విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ప్రస్తుతం 20 కోట్ల కంప్యూటర్లు పనిచేస్తున్నాయని, మైక్రోసాఫ్ట్ చరిత్రలో అత్యంత వేగవంతంగా దూసుకెళ్తున్న ఆపరేటింగ్ సిస్టమ్ ఇదేనని ఆ సంస్థ పేర్కొంది.

చిత్రం... న్యూఢిల్లీలో గురువారం ‘సర్ఫేస్ ‘ప్రో-4’ ట్యాబ్లెట్‌ను ఆవిష్కరిస్తున్న మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రతినిధులు