బిజినెస్

వ్యవసాయ ఎగుమతుల జోన్లలో రెండవ స్థానం సాధించిన రెండు తెలుగు రాష్ట్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 8: రెండు తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయ ఎగుమతుల జోన్లు ఉత్పత్తుల ఎగుమతుల్లో దేశం మొత్తం మీద రెండవ స్థానం సాధించాయని అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) సర్వేలో వెల్లడైంది.
రెండు రాష్ట్రాల నుంచి 2,890 కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. అనంతపురం, చిత్తూరు, కరీంనగర్, కృష్ణా, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఐదు అగ్రి ఎగుమతుల జోన్లు ఉన్నాయి. ఈ జోన్ల అభివృద్ధికి 207 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి.
కాగా, 2023 నాటికి భారత్ నుంచి వ్యవసాయ ఎగుమతుల ఉత్పత్తుల విలువ 300 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అసోచామ్ పేర్కొంది. మరోవైపు గత దశాబ్ధంతో పోల్చితే కాఫీ, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు ఎనిమిది రెట్లు పెరిగాయి. ఐదు బిలియన్ల డాలర్ల నుంచి 39 బిలియన్ల డాలర్లకు చేరింది.
దేశంలో అగ్రి ఎక్స్‌పోర్టు జోన్ల అభివృద్ధికి ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం పద్ధతిని అమలు చేయాలని, రైతులు, ప్రభుత్వాల్లో మరింత అవగాహన పెంచాలని అసోచామ్ సిఫార్సు చేసింది. సమాచార టెక్నాలజీని అమలు చేయాలని పేర్కొంది. మెగాఫుడ్ పార్కులు, కోల్డ్‌స్టోరేజీ స్కీంలు అమలు చేయాలని సిఫార్సు చేసింది.

15న పిఐబి వద్దకు తపాలా శాఖ పేమెంట్ బ్యాంక్ ప్రతిపాదన
న్యూఢిల్లీ, జనవరి 8: తపాలా శాఖ 800 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయాలనుకుంటున్న పేమెంట్ బ్యాంక్ ప్రతిపాదనను పబ్లిక్ ఇనె్వస్ట్‌మెంట్ బోర్డు (పిఐబి) ఈ నెల 15న పరిశీలించనుంది. ఈ మేరకు శుక్రవారం సంబంధిత వర్గాలు పిటిఐకి తెలిపాయి. పిఐబి ఆమోదం తర్వాత నెల రోజుల వ్యవధిలో ఈ ప్రతిపాదన కేంద్ర కేబినెట్ వద్దకు చేరనుంది. ప్రభుత్వరంగ సంస్థల పెట్టుబడుల ప్రతిపాదనలను పరిశీలించే పిఐబి.. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది.