బిజినెస్

స్థూల ఆర్థిక గణాంకాలు కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: భారత స్టాక్ మార్కెట్లను సోమవారం నుంచి మొదలయ్యే ఈ వారంలో ప్రపంచ మార్కెట్లలో నెలకొనే ధోరణితో పాటు దేశీయంగా పారిశ్రామిక ఉత్పత్తి, ద్రవ్యోల్బణం గణాంకాలు ప్రభావితం చేయనున్నాయని నిపుణులు పేర్కొన్నారు. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం పనిచేయవు. అందువల్ల ఈ వారంలో నాలుగు రోజులే మార్కెట్లు పనిచేస్తాయి. ఈక్విటీలపై ఆర్జించే లాభాలపై పది శాతం దీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్‌టీసీజీ) పన్ను విధిస్తూ బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదన స్టాక్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపడంతో శుక్రవారంతో ముగిసిన గత వారంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ భారీగా 1,060.99 పాయింట్లు (3.02 శాతం) పడిపోయింది. ‘ప్రస్తుతం వెలువడుతున్న మూడో త్రైమాసిక ఫలితాలు పెరుగుతున్న కార్పొరేట్ కంపెనీల లాభాలను, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను ప్రతిబింబిస్తున్నాయి. ఇది మదుపరులకు ఉపశమనం కలిగించే అంశం. అయితే, ద్రవ్యోల్బణం ఒత్తిడి, ద్రవ్యలోటు పెరిగే అవకాశాలు ఉండటంతో ఆర్‌బీఐ తన ద్రవ్య విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ విభాగం అధిపతి వినోద్ నాయర్ పేర్కొన్నారు. అయితే, డిసెంబర్ నెల ఐఐపీ, జనవరి నెల సీపీఐ, డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం గణాంకాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌ను నిర్దేశించనున్నాయని ఆయన విశే్లషించారు. గెయిల్, ఎన్‌హెచ్‌పీసీ వంటి పెద్ద కంపనీలు తమ మూడో త్రైమాసిక ఫలితాలను ఈ వారం వెల్లడించనున్నాయి. శుక్రవారం, శనివారం వెలువడిన ఎస్‌బీఐ, కోల్ ఇండియా మూడో త్రైమాసిక ఫలితాలు కూడా ఈ వారం మార్కెట్‌ను ప్రభావితం చేయనున్నాయని పేర్కొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న ధోరణిని బట్టి స్పందిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇది కొనసాగవచ్చని నిపుణులు పేర్కొన్నారు. అమెరికా మార్కెట్లు ఎలా పుంజుకుంటాయి లేదా పడిపోతాయనే అంశాన్ని దేశీయ మార్కెట్లలో మదుపరులు పరిశీలిస్తుంటారని సామ్‌కో సెక్యూరిటీస్ వ్యవస్థాపకుడు, సీఈఓ జమీత్ మోడీ పేర్కొన్నారు.