బిజినెస్

లక్ష్యాన్ని అధిగమించిన జల విద్యుత్ కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీలేరు, మార్చి 7: సీలేరు జల విద్యుత్ కేంద్రం విద్యుత్ ఉత్పత్తిలో విధించిన గడువుకు ముందే లక్ష్యాన్ని సాధించిందని ఎపీ జెన్‌కో డివిజనల్ ఇంజనీర్ సుధాకర్ తెలిపారు. ఆయన బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ 2017-18 ఆర్థిక సంవత్సరానికి సెంట్రల్ అథారిటీ ఎలక్ట్రీసిటీ సీలేరు జల విద్యుత్ కేంద్రం ద్వారా 455 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని మార్చి 31లోపు పూర్తి చేయాలని లక్ష్యాన్ని విధించిందని, అయితే లక్ష్యానికి 25 రోజుల ముందే విద్యుత్ ఉత్పత్తిలో సీలేరు జల విద్యుత్ కేంద్రం విజయం సాధించిందన్నారు. ఇంజనీర్లు, సిబ్బంది ఈ సందర్భంగా మిఠాయిలు పంచుకున్నారు. ఈ ఏడాది జల విద్యుత్ కేంద్రంలో యూనిట్లు తరచూ మరమ్మతులకు గురైనప్పటికీ వాటిని అధిగమించి లక్ష్యాన్ని చేరుకోవడం విశేషమన్నారు. గత ఏడాది మొదట్లో మొదటి యూనిట్ టాక్టర్ ఎర్త్ సమస్యతో మొరాయించిందని, మూడవ యూనిట్ వాటర్ కూలర్ లీకేజీ కారణంగా 15 రోజులు విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందని, నాలుగో యూనిట్ టాక్టర్ ఎర్త్ సమస్యతో ప్రస్తుతం పని చేయడం లేదన్నారు. ఇన్ని ఇబ్బందుల మధ్య విధించిన లక్ష్యాన్ని 25 రోజుల ముందే చేరుకుని రికార్డు సొంతం చేసుకుందన్నారు. గత ఏడాది మాత్రం నీటి సమస్య కారణంగా నిర్ణీత వ్యవధిలో లక్ష్యాన్ని చేరుకోలేక పోయిందన్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి 450 మిలియన్ యూనిట్ల లక్ష్యాన్ని విధించి 425.24 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేసి లక్ష్యాన్ని చేరుకోలేకపోయిందన్నారు. అంతకు ముందు సంవత్సరంలో 446 మిలియన్ యూనిట్లు లక్ష్యాన్ని విధించగా 6045 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించిందన్నారు. ఇంజనీర్లు, సిబ్బంది సమష్టి కృషితోనే లక్ష్యాన్ని సాధించగలిగామన్నారు. గురువారం జల విద్యుత్ కేంద్రంలో నిర్వహించే సంబరాలకు చీఫ్ ఇంజనీర్ మోహన్‌రావు హాజరవుతారన్నారు.