బిజినెస్

మార్కెట్లకు ‘ట్రేడ్ వార్’ దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 7: విదేశీ స్టాక్ మార్కెట్లు పడిపోవడంతో దాని ప్రభావం వల్ల దేశీయ మార్కెట్లు వరుసగా ఆరో సెషన్ బుధవారం కూడా నష్టపోయాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నత స్థాయి ఆర్థిక సలహాదారు గ్యారీ కోహన్ తన పదవి నుంచి తప్పుకున్న తరువాత అమెరికా వాణిజ్య యుద్ధానికి (ట్రేడ్ వార్‌కు) దిగుతుందన్న ఆందోళన నెలకొని ప్రపంచ స్టాక్ మార్కెట్లు పడిపోయాయి. దీని ప్రతికూల ప్రభావం భారత మార్కెట్లపైనా పడింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ బుధవారం 284 పాయింట్లు దిగజారి, మూడు నెలల కనిష్ట స్థాయి 33,033 పాయింట్లకు పడిపోగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 95 పాయింట్లు దిగజారి, 10,200 స్థాయికన్నా దిగువకు పడిపోయింది.
పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ)లో జరిగిన దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణం కేసులో ప్రభుత్వం దర్యాప్తును విస్తృతం చేయడంతో మదుపరులు తమ వద్ద ఉన్న బ్యాంకింగ్ రంగ షేర్లను వదులుకోవడానికి ఎగబడ్డారు. దీంతో బ్యాంకుల షేర్ల విలువ మరోసారి పడిపోయింది. అమెరికా అధ్యక్ష భవనం శే్వత సౌధంలో ఆర్థిక సలహాదారు గ్యారీ కోహన్.. వాణిజ్య యుద్ధం (ట్రేడ్ వార్) విధానం, రక్షణాత్మక విధానంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తలెత్తిన విభేదాల వల్ల తన పదవికి రాజీనామా చేయడం ఆసియా, ఐరోపా వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. సెనె్సక్స్ బుధవారం 284.11 పాయింట్లు (0.85 శాతం) పడిపోయి, 33,033.09 పాయింట్ల వద్ద ముగిసింది. సెనె్సక్స్ డిసెంబర్ ఏడో తేదీ తరువాత ఇంత దిగువ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. డిసెంబర్ ఏడో తేదీన ఈ సూచీ 32,949.20 పాయింట్ల వద్ద ముగిసింది. బుధవారం ఇంట్రా-డేలో ఈ సూచీ 32,991.14- 33,331.21 పాయింట్ల మధ్య కదలాడింది. సెనె్సక్స్ ఆరు సెషన్లలో కలిపి 1,412.66 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ బుధవారం 95.05 పాయింట్లు (0.93 శాతం) దిగజారి, 10,154.20 పాయింట్ల వద్ద ముగిసింది.
ఇదిలా ఉండగా, మంగళవారం దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) నికరంగా రూ. 734.33 కోట్ల విలువయిన షేర్లను విక్రయించగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ. 620.08 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేశారు. బుధవారం నాటి లావాదేవీల్లో ఎస్‌బీఐ, పీఎన్‌బీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ నేతృత్వంలో బ్యాంకింగ్ రంగ షేర్ల విలువ 3.84 శాతం వరకు పడిపోయింది. ఇదిలా ఉండగా, పీఎన్‌బీలో జరిగిన కుంభకోణానికి సంబంధించి వాంగ్మూలం ఇవ్వడానికి ఆ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సునిల్ మెహతా బుధవారం సీరియస్ ఫ్రాడ్ ఇనె్వస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐఓ) ముందు హాజరయ్యారు.
సుమారు 31 బ్యాంకుల అధికారులకు ఎస్‌ఎఫ్‌ఐఓ సమన్లు జారీ చేస్తుందని భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ బ్యాంకింగ్ రంగ షేర్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. ఇదిలా ఉండగా, గీతాంజలి జెమ్స్ షేర్ ధర బుధవారం అయిదు శాతం పడిపోయి, 52 వారాల కనిష్ట స్థాయికి దిగజారింది. ఈ షేర్ ధర పడిపోవడం ఇది వరుసగా 15వ సెషన్. పీఎన్‌బీ కుంభకోణం వెలుగు చూసిన తరువాత ఫిబ్రవరి 14నుంచి గీతాంజలి జెమ్స్ షేర్ విలువ సుమారు 80 శాతం పడిపోయింది. బుధవారం నష్టపోయిన సంస్థల్లో అదాని పోర్ట్స్, భారత ఎయిర్‌టెల్, ఓఎన్‌జీసీ, రిల్, టాటా స్టీల్, ఎల్‌అండ్‌టీ మొదలగునవి ఉన్నాయి.