బిజినెస్

ఆశలు రేపుతున్న ‘భాగస్వామ్యం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 8: విశాఖలో ఆదివారం నుంచి మూడు రోజులపాటు జరగనున్న భాగస్వామ్య సదస్సుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఆశలు పెట్టుకుంది. సిఐఐ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సుకు సుమారు 30 దేశాల నుంచి ప్రారిశ్రామిక దిగ్గజాలు వస్తున్నారు. దాదాపు 2,000 మంది పారిశ్రామిక ప్రతినిధులు హాజరవుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక దేశాల్లో పర్యటిస్తున్నది తెలిసిందే. అయతే వీటన్నింటికన్నా ముఖ్యమైనది, ప్రభుత్వం చాలా ఆశలు పెట్టుకున్నది ఈ భాగస్వామ్య సదస్సుపైనే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడేళ్ల కిందట హైదరాబాద్‌లో ఇటువంటి సదస్సు జరిగింది. రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా ఈ సదస్సు ఇక్కడ నిర్వహిస్తున్నారు. వౌలిక సదుపాయాలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటి, పోర్టులు, సీ ఫుడ్స్, తదితర రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో వివిధ పరిశ్రమలు, ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు సంబంధించి ఉన్న అవకాశాలను ఈ సదస్సుకు వచ్చే ప్రతినిధులకు వివరించనున్నారు. ఇప్పటికే వివిధ దేశాల నుంచి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంగా వారితో ఎంఓయులు కుదుర్చుకోనున్నారు. 200లకుపైగా ఎంఓయులపై సంతకాలు జరిగే అవకాశం ఉందని అధికారులు తెలియచేస్తున్నారు.
కోరినవన్నీ ఇస్తాం: ఏపిఐఐసి ఎండి
పారిశ్రామిక వేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే చాలు. వారికి కావల్సిన సదుపాయాలన్నీ తక్షణం అందిస్తామని ఏపిఐఐసి ఎండి శ్రీ్ధర్ ‘ఆంధ్రభూమి’కి తెలియచేశారు. ఇప్పటికి ఉన్న సమాచారం ప్రకారం లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ఆయన తెలియచేశారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని శ్రీ్ధర్ చెప్పారు.
నేటి నుంచి ప్రతినిధులు రాక
దేశ, విదేశాల నుంచి సుమారు రెండు వేల మంది ప్రతినిధులు ఇక్కడికి వస్తుండగా, వీరంతా శనివారం నుంచి విశాఖ నగరానికి చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్‌తో సహా ఆరుగురు కేంద్ర మంత్రులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. వివిఐపిలు సుమారు 100 నుంచి 150 మంది వరకూ ఉంటారు.
అబ్బురం..సదస్సు ప్రాంగణం
ఇదిలా ఉండగా సదస్సు కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అత్యంత ఖరీదైన ఫర్నీచర్, వాల్ పెయింటింగ్స్, డైనింగ్ హాల్స్, కాన్ఫరెన్స్ హాల్స్‌ను నిర్మించారు. ప్రధాన వేదిక వద్ద సుమారు 3,000 మంది కూర్చునేందుకు వీలు కల్పించారు. సదస్సు ప్రాంగణంలో నాలుగు బ్లాక్స్ ఏర్పాటు చేశారు. ఇవన్నీ సెంట్రలైజ్డ్ ఏసితో కూడుకుని ఉన్నాయి.
సన్‌రైజ్ స్టేట్ కొత్త లోగో
ఆంధ్రప్రదేశ్‌ను సన్‌రైజ్ స్టేట్‌గా అంతా అభివర్ణిస్తుండగా, దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక కొత్త లోగోను ఆవిష్కరించడానికి సమాయత్తం అవుతోంది. 10వ తేదీన జరిగే భాగస్వామ్య సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ లోగోను ఆవిష్కరించనున్నారు.