బిజినెస్

నెలాఖర్లోగా ఎస్‌టిపిపి పూర్తవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: ఈ నెలాఖరుకల్లా సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్‌టిపిపి) మొదటి యూనిట్ సింక్రనైజేషన్‌కు సంబంధించి పనులన్నీ పూర్తిచేయాలని సింగరేణి సిఎండి ఎన్ శ్రీ్ధర్ ఆదేశించారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా జైపూర్ వద్ద సింగరేణి ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పురోగతిపై ఆయన అధికారులతో సమీక్షించారు. సర్క్యులేటెట్ వాటర్ సిస్టం, చినీ, ఇంట్యూస్ట్ డ్రాఫ్ట్, కూలింగ్ టవర్లు, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌లకు సంబంధించి పనులను అడిగి తెలుసుకున్నారు. మొదటి, రెండో యూనిట్ల పనులపై కూడా సమీక్షించారు. అవసరమైన వివిధ మెటీరియల్స్‌ను వెంటనే సమకూర్చుకోవాలని ఆయా నిర్మాణ సంస్థలను ఆయన ఆదేశించారు. ఈ సమీక్షలో సింగరేణి సంస్థ ఫైనాన్స్ డైరెక్టర్ జె పవిత్రన్ కుమార్, ఐఆర్‌ఎస్ డైరెక్టర్ బి రమేశ్‌కుమార్, మనోహర్‌రావు, ఎస్‌కె నూర్, కన్‌స్ట్రక్షన్స్ అధికారులు, ఎన్‌టిపిసి అధికారులు పాల్గొన్నారు.

ఏపిలో ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్
371 మెగావాట్ల విద్యుత్ యూనిట్ షురూ

న్యూఢిల్లీ, జనవరి 9: ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్ అనుబంధ సంస్థ, ల్యాంకో కొండపల్లి పవర్ లిమిటెడ్.. విజయవాడ వద్ద 371 మెగావాట్ల యూనిట్‌ను ఉత్పత్తిలోకి తెచ్చింది. ఈ మేరకు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు శనివారం ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ తెలియజేసింది. కాగా, మూడు దశల్లో అభివృద్ధిపరచిన ఈ గ్యాస్ ఆధారిత పవర్ ప్రాజెక్టులో గత ఏడాది ఆగస్టులో ఓ 371 మెగావాట్ల యూనిట్‌ను ల్యాంకో ఉత్పత్తిలోకి తీసుకొచ్చింది.

ద్వితీయ శ్రేణి నగరాలపై హార్లే దృష్టి

లక్నో, జనవరి 9: అమెరికాకు చెందిన లగ్జరీ బైక్‌ల తయారీ సంస్థ హార్లే డేవిడ్‌సన్.. దేశంలోని చిన్న నగరాలపై దృష్టి సారించింది. ‘్భరత్‌లోని ద్వితీయ శ్రేణి నగరాల్లో మా బైక్‌ల అమ్మకాలకు వీలుగా చర్యలు చేపడుతున్నాం.’ అని హార్లే డేవిడ్‌సన్ ఇండియా ఎండి విక్రమ్ పవా శనివారం ఇక్కడ పిటిఐతో అన్నారు. గడచిన ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 12,000కుపైగా బైక్‌లను అమ్మినట్లు ఈ సందర్భంగా ఆయన చెప్పారు. లక్నోలో హార్లే డేవిడ్‌సన్ బైక్ కనిష్ట ధర 4.6 లక్షల రూపాయలుగా ఉందని విక్రమ తెలిపారు.

ఎల్‌పిజి సేవలపై చమురు శాఖ అభిప్రాయ సేకరణ

న్యూఢిల్లీ, జనవరి 9: వంటగ్యాస్ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించడంలో భాగంగా దేశవ్యాప్తంగా ఎల్‌పిజి కస్టమర్ల నుంచి సలహాలు, సూచనలను కోరుతోంది పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌లో అభిప్రాయ సేకరణను చేపట్టింది. ఇందుకు సంబంధించి సిటిజన్ ఫ్రెండ్లీ సర్వీసెస్, ఇంక్రీజింగ్ ఎల్‌పిజి కవరేజ్ అనే రెండు ఆన్‌లైన్ డిస్కషన్ ఫోరమ్‌లను ప్రారంభించి వాటిని ౄకయ్ప.జశ, ౄకఔ.జశ వెభ్‌సైట్లలో అందుబాటులో ఉంచింది. వీటితో కస్టమర్లు తమ ఆలోచనలను పంచుకోవాలని ఓ అధికారిక ప్రకటన శనివారం విజ్ఞప్తి చేసింది.