బిజినెస్

ఈ ఏడాది 12 కొత్త కార్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 9: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్.. దేశీయంగా గత ఏడాది రికార్డుస్థాయి అమ్మకాలను నమోదు చేసింది. శనివారం ఆ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం 2015లో భారతీయ మార్కెట్‌లో 13,502 బెంజ్ కార్లు అమ్ముడయ్యాయి. 2014లో ఇవి 10,201 కార్లుగా ఉన్నాయి.
ఈ క్రమంలో ఈ ఏడాది అమ్మకాలను మరింతగా పెంచుకోవాలని చూస్తున్న బెంజ్.. 12 కొత్త మోడళ్లను మార్కెట్‌కు పరిచయం చేయాలని భావిస్తోంది. కాగా, లగ్జరీ సెడాన్‌లో సిఎల్‌ఎ, సి-క్లాస్, ఇ-క్లాస్, ఎస్-క్లాస్ మోడల్ కార్లకు విపరీతంగా డిమాండ్ కనిపిస్తోందని, గత ఏడాది ఈ కార్ల అమ్మకాలు 42 శాతం పెరిగాయని మెర్సిడెస్ బెంజ్ ఇండియా సిఇఒ, ఎండి రోలాండ్ ఫోల్గర్ అన్నారు. అలాగే ఎస్‌యువి కార్లైన జిఎల్‌ఎ, జిఎల్‌ఇ, జిఎల్-క్లాస్ కార్ల అమ్మకాలకు ఆదరణ భారీగా ఉందన్నారు.
గత ఏడాది జిఎల్‌ఎ, సిఎల్‌ఎ, మేబ్యాచ్ ఎస్ 500 మోడల్ కార్లను మెర్సిడెస్ బెంజ్ మార్కెట్‌కు పరిచయం చేసింది. దేశీయంగా ఏ లగ్జరీ కార్ల తయారీ సంస్థ కూడా పెట్టనంతగా 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఉత్పాదక సామర్థ్యం పెంచుకోవడానికి పెడుతున్నామని బెంజ్ ఈ సందర్భంగా ప్రకటనలో స్పష్టం చేసింది.

ఎల్‌ఇడిల వినియోగంతో
ఏటా రూ. 40 వేల కోట్లు ఆదా

ముంబయి, జనవరి 9: విద్యుత్‌ను పొదుపు చేయడంలో భాగంగా ఎల్‌ఇడి బల్బులను 2018నాటికి విస్తృతంగా వినియోగంలోకి తేవాలన్న ప్రభుత్వ నిర్ణయం.. ఏటా సుమారు 40,000 కోట్ల రూపాయల (6 బిలియన్ డాలర్లు)ను ఆదా చేయనుందని కేంద్ర విద్యుత్, బొగ్గు, నూతన, పునరుత్పాదక శక్తి శాఖ మంత్రి పియూష్ గోయల్ తెలిపారు.
డొమెస్టిక్ ఎఫిషియెంట్ లైటింగ్ ప్రోగ్రామ్ (డిఇఎల్‌పి)లో భాగంగా ఇప్పటిదాకా దాదాపు 4.59 కోట్ల ఎల్‌ఇడి బల్బులను పంపిణీ చేసినట్లు చెప్పారు. ఎప్పుడైతే ప్రస్తుతం వాడుతున్న 71 కోట్ల సాధారణ బల్బుల స్థానంలో ఎల్‌ఇడి బల్బులు వినియోగంలోకి వస్తాయో అప్పుడు 100 బిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేసినట్లవుతుందన్నారు. శనివారం ఇక్కడ హార్వర్డ్ కాలేజ్ యుఎస్ ఇండియా ఇనీషియేటివ్ కాన్ఫరెన్స్‌లో గోయల్ పాల్గొన్నారు. ఎల్‌ఇడి బల్బులను అందరూ వినియోగించాలన్న ఉద్దేశ్యంతో ధరలను అదుపులోకి తెచ్చామన్నారు. 2014 ఫిబ్రవరిలో 310 రూపాయలుగా ఉన్న ఎల్‌ఇడి బల్బు ధరను జూన్ నాటికి 73 రూపాయలకు తెచ్చామన్నారు.