బిజినెస్

ద్వితీయ శ్రేణి నగరంలో ఇదే తొలిసారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 9: కానె్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) గడచిన 21 సంవత్సరాల్లో 22 భాగస్వామ్య సదస్సులు నిర్వహించిందని దక్షిణ భారత సిఐఐ డైరెక్టర్ మహేశ్ నటరాజన్ తెలియచేశారు. శనివారం ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ ప్రస్తుతం విశాఖలో జరగనున్న సదస్సులో 41 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారన్నారు. ఇప్పటివరకూ జరిగిన సదస్సులన్నీ ప్రధాన నగరాల్లోనే జరిగాయని, కానీ తొలిసారిగా ద్వితీయ శ్రేణి నగరమైన విశాఖలో జరుగుతోందని చెప్పారు. అయతే విశాఖ నగరం ద్వితీయ శ్రేణి నగరం అన్న భావన తమకు కలగడం లేదని ఆయన చెప్పారు. ఇక్కడున్న ఎయిర్‌పోర్ట్, స్టార్ హోటళ్లు, సుందర ప్రదేశాలు తమను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని నటరాజన్ వివరించారు. స్థానిక అధికారుల సహకారం మరువలేనిదిగా పేర్కొ న్నారు. దేశంలోని కొన్ని ప్రముఖ నగరాల కన్నా విశాఖ అద్భుతంగా ఉందని నటరాజన్ అభిప్రాయపడ్డారు.
కాగా, భాగస్వామ్య సదస్సులో జరిగే ఎంఓయుల విషయంలో సిఐఐ ఏమాత్రం జోక్యం చేసుకోదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘దేశ, విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలను ఒకచోట చేర్చుతాం. దేశంలో లేదా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, పరిశ్రమల స్థాపనకు అనువైన పరిస్థితులను ఆయా పారిశ్రామికవేత్తలకు వివరించాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వాలపైనే ఉంటుంది. కుదిరిన ఒప్పందాలు కార్యరూపం దాల్చేలా చూసుకోవల్సిన బాధ్యత పరిశ్రమల శాఖ, ఇతర శాఖల మీద ఉంటుంది.’ అని ఆయన స్పష్టం చేశారు. ‘ఎంఓయులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రులు కూడా ఇక్కడికి వస్తున్నందున వారి సమక్షంలోనే పరిశ్రమల స్థాపనకు కావల్సిన సదుపాయాల కల్పన గురించి మాట్లాడుకోవలసి ఉంటుంది. సిఐఐ కల్పిస్తున్న అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవలసి ఉంది. కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వం మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని నినాదాలు ఇచ్చాయి. వాటిని నిజం చేసేందుకు ఇది ఒక వేదికగా ఉపయోగపడుతుంది.’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సదస్సులో దేశాలు-దేశాల మధ్య, కంపెనీలు-కంపెనీల మధ్య ఒప్పందాలు కుదరబోతున్నాయన్నారు. విశాఖలో మరిన్ని పరిశ్రమలు రావడానికి మెరుగైన పరిస్థితులు ఉన్నాయని నటరాజన్ చెప్పారు. విశాఖకు వివిధ సంస్థలను తీసుకువచ్చేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి విశాఖపై ప్రత్యేక దృష్టి ఉన్నందున, సిఐఐ సదస్సు భారీగా నిర్వహించేందుకు సహకరించారని నటరాజన్ తెలిపారు. ఈ సదస్సు ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలపైనా ఫోకస్ చేస్తుందన్నారు. ముఖ్యంగా తయారీ, ఐటి సంస్థలు విశాఖకు వచ్చే అవకాశం ఉందని నటరాజన్ చెప్పారు.

మహేశ్ నటరాజన్

మ్యాగీని వెనక్కి నెడతాం

పతంజలి నూడుల్స్‌ను మార్కెట్‌లో మొదటి స్థానానికి తెస్తాం
యోగా గురువు రామ్‌దేవ్ బాబా విశ్వాసం
ముంబయి, జనవరి 9: రాబోయే కొనే్నళ్లలో దేశీయ మార్కెట్‌లో అత్యంత ఆదరణ కలిగిన నూడుల్స్ బ్రాండ్‌గా మ్యాగీని పతంజలి ఆటా నూడుల్స్ వెనక్కి నెట్టేస్తుందని యోగా గురువు రామ్‌దేవ్ బాబా అన్నారు. కన్జ్యూమర్ గూడ్స్ విభాగంలో హిందుస్థాన్ యునిలివర్ లిమిటెడ్ (హెచ్‌యుఎల్) మినహా అన్ని బహుళజాతి సంస్థలను స్వదేశీ ఎఫ్‌ఎమ్‌సిజి సంస్థ అయిన పతంజలి అధిగమించనుందన్నారు. శనివారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు. ప్రస్తుతం దాదాపు 100 టన్నులుగా ఉన్న తమ పతంజలి ఆటా నూడుల్స్ ఉత్పత్తి.. త్వరలో 300-500 టన్నులకు పెంచుతామన్నారు. మార్కెట్‌లో పోటీ సంస్థల కంటే తక్కువ ధరకే తమ పతంజలి ఉత్పత్తులను విక్రయిస్తామన్నారు. ఇక రాబోయే 5-7 ఏళ్లలో 5,000 కోట్ల రూపాయల నుంచి 10,000 కోట్ల రూపాయల లాభాలను పతంజలి అంచనా వేస్తోంది. ఈ మొత్తాన్ని లాభదాయకేతర పనులకు వెచ్చించనున్నట్లు రామ్‌దేవ్ చెప్పారు. కాగా, గత ఐదేళ్లుగా చేస్తున్న పోరాటంతో నల్లధనం, అవినీతిపై ప్రజల్లో ఓ అవగాహన వచ్చిందని, అయితే పూర్తిస్థాయిలో వీటిని రూపుమాపడానికి ప్రభుత్వానికి మరికొంత సమయం పట్టవచ్చన్నారు.