బిజినెస్

ప్రపంచ రికార్డు సృష్టించిన అమెరికా పవర్‌బాల్ జాక్‌పాట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోస్టన్, జనవరి 10: అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో నిర్వహించే పవర్‌బాల్ జాక్‌పాట్ లాటరీ సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టిస్తూ వంద కోట్ల డాలర్ల స్థాయిని దాటిపోయింది. ఇప్పటికే రికార్డు స్థాయిలో ఉన్న 90 కోట్ల డాలర్ల జాక్‌పాట్ కోసం శనివారం రాత్రి జరిగిన లాటరీలోనూ ఎవరినీ అదృష్టం వరించలేదు. శనివారం జరిగిన లాటరీలో మ్యాజిక్ అంకెలయిన 32-16-19-57-34, అలాగే పవర్‌బాల్ నంబరు 13 ఏ టికెట్ కొనుగోలుదారుడి వద్దా లేకపోవడంతో వచ్చే వారానికి లాటరీ వాయిదా పడింది. ప్రతి బుధ, శనివారాల్లో స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10:59 గంటలకు నిర్వహించే ఈ లాటరీ తదుపరి డ్రా సమయానికి దీని మొత్తం 130 కోట్ల డాలర్లకు పెరిగిపోనుంది. అనేక వారాలుగా ఎవరూ విజేతలు కాకపోవడంతో 44 రాష్ట్రాలు, వాషింగ్టన్ మరో రెండు అమెరికన్ టెరిటరీలో నిర్వహించే ఈ లాటరీకి సంబంధించి గ్రాండ్ ప్రైజ్ మొత్తం ఇలా పెరిగిపోతూ ఉంది. అయితే ప్రైజ్ మనీ మొత్తం పెరిగిపోయే కొద్దీ రాత్రికి రాత్రి ధనవంతులమైపోతామని కలలు కనే అమెరికన్లు ఈ లాటరీ టికెట్లను పెద్ద సంఖ్యలో కొంటూనే ఉన్నారు. దీంతో ఆ విజేత ఎవరవుతారా అనే ఉత్సుకత కూడా మరింత పెరిగిపోయింది. పవర్‌బాల్ లాటరీలో 69 తెల్ల బంతులుండే డ్రమ్ములోంచి అయిదు బంతులను, అలాగే 26 ఎర్రబంతులుండే డ్రమ్మునుంచి ఒక బంతిని తీస్తారు. ఎంపిక చేసిన బంతులపై ఉండే నంబరుతో టికెట్ కొనుగోలుదారుడి వద్ద ఉండే నంబర్లు సరిపోలితే జాక్‌పాట్ కొట్టేసినట్లే. మొదటి అయిదు నంబర్లు ఏ ఆర్డర్‌లోనైనా ఉండొచ్చు కానీ ఆరోది మాత్రం పవర్‌బాల్ నంబరయి ఉండాలి. గెలుపొందిన వ్యక్తి బహుమతి మొత్తాన్ని 29 సంవత్సరాల పాటు వాయిదాల్లో కానీ లేదా కాస్త తగ్గించిన మొత్తాన్ని ఒకేసారి తీసుకోవచ్చు.