బిజినెస్

బిఎస్‌ఇకి ప్రత్యేక పోస్టల్ స్టాంప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 10: ఆసియా ఖండంలో పురాతన స్టాక్ ఎక్స్‌చేంజ్ అయిన బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బిఎస్‌ఇ).. తనకంటూ సొంత పోస్టేజ్ స్టాంప్ గుర్తింపును పొందనుంది. ఈ మేరకు కేంద్ర టెలికాం, సమాచార, ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ‘బిఎస్‌ఇ కోరిక మేరకు దానికి ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను జారీ చేస్తున్నాం. నేను చాలా ఆనందిస్తున్నాను. బిఎస్‌ఇ సేవలకు ప్రభుత్వ గుర్తింపు ఇది.’ అని అన్నారు. ఆదివారం ఇక్కడ ప్రజలకు బిఎస్‌ఇ ఉచిత వైఫై సేవలను ప్రారంభించగా, ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రసాద్ పాల్గొన్నారు. బిఎస్‌ఇలో 3 కోట్ల రిజిస్టర్డ్ ఇనె్వస్టర్లుండగా, ఇందులోని సంస్థల మార్కెట్ విలువ ప్రస్తుతం దాదాపు 100 లక్షల కోట్ల రూపాయలు. ఇంతకుముందు 100 లక్షల కోట్ల మార్కును దాటగా, తాజా నష్టాలతో అది పడిపోయింది. ఇదిలావుంటే విలేఖరులతో మాట్లాడుతూ తపాలా శాఖ ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలతో పొత్తు కుదుర్చుకుందని ఈ ఆర్థిక సంవత్సరం (2015-16)లో క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా 1,500 కోట్ల రూపాయల వసూళ్ల లక్ష్యాన్ని అందుకుంటుందని భావిస్తున్నట్లు మంత్రి ప్రసాద్ అన్నారు. డిసెంబర్ వరకు 1,000 కోట్ల రూపాయల వసూళ్లను సాధించినట్లు చెప్పారు. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17) నాటికి దేశవ్యాప్తంగా 256 చోట్ల 2,500 వైఫై హాట్‌స్పాట్లను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. నేడు దేశంలో 100 కోట్ల మంది మొబైల్ వినియోగదారులున్నారని, 40 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులున్నారని, రాబోయే 6-7 నెలల్లో దీన్ని 50 కోట్లకు పెంచాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే 2,500 వైఫై హాట్‌స్పాట్ల ఏర్పాటుకు సిద్ధమయ్యామన్నారు. మరోవైపు ఇంటెర్నెట్‌లో నిష్పక్షపాత వైఖరికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందరూ సమానులే అన్న సూక్తికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని నెట్ న్యూట్రాలిటీపై స్పందిస్తూ మంత్రి స్పష్టం చేశారు. ఈ విషయంలో టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ అభిప్రాయ సేకరణ చేస్తోందని, ఆ నివేదిక వచ్చాక ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా, నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వరంగ టెలికాం సంస్థ ఎమ్‌టిఎన్‌ఎల్.. వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17)లో లాభాల్లోకి వచ్చే అవకాశాలున్నాయని మంత్రి అన్నారు. మరో ప్రభుత్వరంగ టెలికాం సంస్థ అయిన బిఎస్‌ఎన్‌ఎల్ ఇప్పటికే లాభాల్లోకి వచ్చిందని గుర్తుచేశారు. గత ఆర్థిక సంవత్సరం (2014-15)లో 672 కోట్ల రూపాయల నిర్వహణ లాభాలను అందుకుందని గుర్తుచేశారు. ప్రైవేట్‌రంగ సంస్థల నుంచి ఎదురవుతున్న తీవ్ర పోటీతో బిఎస్‌ఎన్‌ఎల్, ఎమ్‌టిఎన్‌ఎల్ నష్టాల పాలవుతున్నాయి.

విలేఖరులతో మాట్లాడుతున్న రవిశంకర్ ప్రసాద్