బిజినెస్

రుణ మార్కెట్లపైనే ఎఫ్‌పిఐల ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 10: విదేశీ మదుపరులు ఈ నూతన సంవత్సరం దేశీయ మార్కెట్లలో పెట్టుబడులపట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే స్టాక్ మార్కెట్ల కంటే రుణ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. ఈ నెలలో ఇప్పటిదాకా రుణ మార్కెట్లలోకి 3,700 కోట్లకుపైగా పెట్టుబడులను తెచ్చారు. 1-8 మధ్య విదేశీ పోర్ట్ఫోలియో మదుపరు (ఎఫ్‌పిఐ)లు 3,706 కోట్ల రూపాయల విలువైన బాండ్లను కొనుగోలు చేసినట్లు డిపాజిటరీలు తెలిపిన సమాచారం. కానీ ఇదే సమయంలో స్టాక్ మార్కెట్ల నుంచి ఎఫ్‌పిఐలు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం గమనార్హం. 493 కోట్ల రూపాయల పెట్టుబడులను లాగేసుకున్నారు. దీంతో దేశీయ మార్కెట్లలో ఎఫ్‌పిఐల నికర పెట్టుబడుల విలువ 3,213 కోట్ల రూపాయలకు పరిమితమైంది. చైనా ఆర్థిక వ్యవస్థ పురోగతిపై అనుమానాలు, సౌదీ అరేబియా-ఇరాన్ మధ్య నెలకొన్న ఆందోళనలు, ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబు ప్రయోగం వంటివి విదేశీ స్టాక్ మార్కెట్లను, దేశీయ స్టాక్ మార్కెట్లను నష్టపరిచాయి. గత వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 1,226.57 పాయింట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 361.85 పాయింట్లు కోల్పోయనది తెలిసిందే. కాగా, భారతీయ మార్కెట్లలోకి విదేశీ మదుపరుల పెట్టుబడులు గత ఏడాది (2015) భారీగా తగ్గాయి. స్టాక్ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ కేవలం 17,806 కోట్ల రూపాయలు (3.2 బిలియన్ డాలర్లు)గా ఉంటే, రుణ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 45,856 కోట్ల రూపాయలు (7.4 బిలియన్ డాలర్లు)గా ఉంది. మొత్తం స్టాక్, రుణ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 63,662 కోట్ల రూపాయలకు పరిమితమైంది. అంతకుముందు ఏడాది 2014లో స్టాక్ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ దాదాపు లక్ష కోట్ల రూపాయలుగా ఉండటం గమనార్హం. 2012, 2013 సంవత్సరాల్లోనూ లక్ష కోట్ల రూపాయల చొప్పున విదేశీ పెట్టుబడులు దేశీయ స్టాక్ మార్కెట్లలోకి వచ్చాయి. ఇక రుణ మార్కెట్లలోకి 2014లో వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 1.6 లక్షల కోట్ల రూపాయలు (26 బిలియన్ డాలర్లు)గా ఉంది. 2014లో మొత్తం రెండున్నర లక్షల కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు అటు స్టాక్, ఇటు రుణ మార్కెట్లలోకి తరలివచ్చాయ. అయతే 2013లో రుణ మార్కెట్ల నుంచి 51,000 కోట్ల రూపాయల (8 బిలియన్ డాల ర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయినప్పటికీ 2012లో 35,000 కోట్ల రూపాయ లు, 2011లో 42,000 కోట్ల రూపాయలు, 2010లో 46, 408 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు.